రాష్ట్రీయం

ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా పదవీ ప్రమాణం చేసిన తమిళిసైకి ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. తమిళిసై సౌందర్‌రాజన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా పదవీ ప్రమాణం చేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఐదు నిమిషాల ముందే రాజ్‌భవన్ చేరారు. ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండగా కేసీఆర్ ముందే వచ్చారు. తమిళిసై గవర్నర్‌గా పదవీ ప్రమాణం చేసిన వెంటనే రాజ్‌భవన్ అధికారులు ‘హై టీ’ ఏర్పాటు చేశారు. తమిళిసైతో కేసీఆర్ 10 నిమిషాల పాటు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ‘తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా మీరు రావడం రావడం నాకు ఆనందాన్ని కలగచేసింద’ని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల గురించి కేసీఆర్ ఈ సందర్భంగా వివరించారు. తమ ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గర్భిణీలకు ఆర్థిక సాయంచేయడంతో పాటు ప్రభుత్వ దవాఖానాల్లో కాన్పు అయిన మహిళలకు ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. తల్లీ, పిల్లలకోసం కేసీఆర్ కిట్స్ పేరుతో ముఖ్యమైన వస్తువులను అందిస్తున్నామన్నారు.