రాష్ట్రీయం

నారాయణపూర్ 20 గేట్లు ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, సెప్టెంబర్ 8: ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు మరోసారి భారీ వరదలు వస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కృష్ణానదికి వరద ఉద్ధృతిని పెంచుతున్నాయి. నారాయణపూర్ జలాశయంలో 29.57 టీఎంపీల నీరు నిల్వ ఉండగా ప్రాజెక్టుకు 2.10 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నారాయణపూర్ 20 గేట్లను ఎత్తి జూరాల వైపు 2,53,500 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ఆల్మట్టి జలాశయంలో 103.465 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ప్రాజెక్టుకు 1,64,999 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి 2 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నట్టు అధికారులు తెలిపారు.