రాష్ట్రీయం

కేంద్రంలో వంద రోజుల మోదీ పాలన అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోదీ వంద రోజుల పాలన అద్భుతంగా సాగిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా అవతరించిందని ఆయన అన్నారు. పార్టీ ఫిరాయించిన వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం సరికాదని ఆయన అన్నారు. పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ విదేశాలతో మైత్రి చేయడంలో ప్రపంచంలో భారత్‌ను మొదటి ఐదింటిలో ఒకటిగా నిలపడంలో మోదీ చేసిన కృషిని ప్రతి ఒక్క భారతీయుడు గుర్తుంచుకుంటారన్నారు. జన్ సంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాల్లో భాగంగా అగ్నిగుండంగా మారిన కాశ్మీర్‌లో శాంతి నెలకొల్పేలా 370వ అధికరణను రద్దు చేశామన్నారు. కల్లోల కశ్మీర్‌లో యువతను అభివృద్ధివైపు తీసుకెళుతున్నమన్నారు. హోంమంత్రిగా ఎన్నో ప్రతిష్టాత్మక బిల్లులు ప్రవేశపెట్టడం అదృష్టంగాగ భావిస్తున్నామన్నారు.చంద్రయాన్-2 కొంతలో విఫలమైనా యావత్తు దేశ ప్రజలు దీనిని విజయవంతంగానే భావిస్తున్నారన్నారు. శాస్తవ్రేత్తలకు భవిష్యత్తులో చేసే మరెన్నో విప్లవాత్మక పరిశోధనలకు అండగా ఉంటామన్నారు. 1952 పార్లమెంటు చరిత్రను తిరగరాసే విధంగా తాజాగా ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో 35 బిల్లులు పెడితే 30 బిల్లులు పాసయ్యాయన్నారు. ప్రజా ప్రయోజకర బిల్లులకు ప్రతిపక్ష పార్టీలు సైతం సహకరించాయన్నారు. దేశానికి వెన్నుముక అయిన రైతులకు పంట సాయం పెన్షన్‌లు ఇచ్చే బిల్లులు పాస్ అయ్యాయన్నారు. జీఎస్‌టీ వల్ల నిత్యావసర వస్తువులు తగ్గాయన్నారు.
పాక్ ఉగ్రవాదాన్ని పెంచి మన దేశంలోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. మన సైనికులు సమర్థంగా తిప్పికొడుతున్నారన్నారు. తనకు జాతీయ దర్యాప్తు ఏజన్సీ (ఎన్‌ఐఏ), చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, 370వ అధికరణ రద్దుపై కొన్ని సవరణల బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం లభించిందని, ఈ బిల్లులన్నీ ఆమోదం పొందాయన్నారు.
ఎన్నో కేంద్ర ప్రయోజనాలను తెలంగాణ ప్రభుత్వం మొండి వైఖరి వల్ల ప్రజలకు అందడం లేదన్నారు. ఆయుష్మాన్‌భవ, ఫసల్ బీమా లాంటి ఎన్నో పథకాల ప్రయోజనాలు ఇక్కడి వారికి అందడం లేదన్నారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ ఈన ఎపాన్ని కేంద్రంపై నెట్టేస్తున్నారన్నారు. 7.1 లక్షల యూరియా కోరితే అదనంగా కేటాయింపులు చేసి సరఫరా చేసిందన్నారు. కేంద్రం, రాష్ట్రప్రభుత్వంలో అవగాహన లేదన్నారు. మంత్రులు రాజకీయ ప్రకటనలు చేసే కన్నా అందుబాటులో ఉన్న యూరియాను లిఫ్ట్ చేసి ఆయా జిల్లాల రైతులకు వెంటనే అందించాలన్నారు. తెలంగాణలో ఎన్‌ఆర్‌సీ (జాతీయ పౌరరిజిస్టర్) చేపట్టాలని నిర్ణయించలేదన్నారు. జమ్ముకాశ్మీర్ పరిస్థితుల్లో మార్పు వస్తోందన్నారు.

చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి