రాష్ట్రీయం

ఏపీ పీపీఏల్లో అక్రమాలు జరిగినట్టు ఆధారాల్లేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు చూసే ప్రజలు మళ్లీ తమకు అధికారాన్ని కట్టబెట్టారని కేంద్ర ఇంధన, విద్యుత్ శాఖల మంత్రి ఆర్‌కే సింగ్ పేర్కొన్నారు. ఐదు ట్రిలియన్ల డాలర్ల ఆర్ధికాభివృద్ధి దిశగా భారత్ అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వ వంద రోజుల ప్రగతి నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన అనేక అంశాలపై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసుకోవాలని నిర్ణయించడాన్ని కేంద్ర మంత్రి తప్పుపట్టారు. ఒప్పందాల్లో అక్రమాలు జరిగినట్టు ఎక్కడా ఆధారాలు లభించలేదని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఒప్పందాలను ఎలా రద్దు చేస్తామని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని అంటోందని, ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి కూడా తీసుకువచ్చిందని, కానీ ఆధారాలను మాత్రం చూపడం లేదని అన్నారు. పీపీఏలను రద్దు చేసుకుంటే పెట్టుబడులపై ప్రభావం పడుతుందని అన్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి వివరించామని, త్వరలోనే ఈ వివాదం సద్దుమణుగుతుందని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. ప్రైవేటు కంపెనీలకు రెండు వేల కోట్లు బకాయిలు చెల్లిస్తారనే నమ్మకం తమకు ఉందని అన్నారు. అవసరమైతే మరోమారు ఏపీ సీఎంతో మాట్లాడతామని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు చారిత్రాత్మక నిర్ణయమని ఆర్‌కే సింగ్ చెప్పారు. తద్వారా జమ్మూకశ్మీర్ ఆర్ధిక పరిస్థితి మారుతుందని అన్నారు. ఆ రాష్ట్రంలో సామాజిక ఆర్ధిక పరిస్థితి మారుతోందని, ఉపాధి కల్పన జరుగుతుందని అన్నారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా దేశం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. పీఎం కిసాన్ పథకాన్ని 6.37 కోట్ల మంది రైతులకు చేరువ చేశామని అన్నారు. బ్యాంకుల విలీనం అంశం మాట్లాడుతూ అదనపు రుణ సదుపాయం, విస్తరణ వంటి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్యలు ద్వారా భారత్ స్థాయి 142 నుండి 77కు చేరుకుందని అన్నారు. పిల్లల హక్కులను కాపాడేందుకు, వారిని సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ చేపట్టనుందని, షెడ్యూల్డు తెగలకు చెందిన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు 180 ఏకలవ్య మోడల్ స్కూళ్లకు కేంద్రం ఆమోదం తెలిపిందని అన్నారు. పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన బదులిస్తూ త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టును తాను సందర్శిస్తానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ అదనంగా ఇచ్చే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.