రాష్ట్రీయం

నల్లమల బంద్ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్రాబాద్, సెప్టెంబర్ 9: నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్, పదర మండలాల పరిధిలో యురేనియం తవ్వకాలను నిరసిస్తూ సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు మండలాల బంద్ విజయవంతమైంది. ఈ మండలాల పరిధిలో వ్యాపారులు, హోటళ్లు స్వచ్ఛందంగా మూశారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలను బంద్ చేయించారు. మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ ప్రాంతంలోని ఆయా గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, జేఎసీ నేతలు, మహిళలు, యువకులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో మన్ననూర్ శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిని దిగ్బంధించి సుమారు రెండు గంటల పాటు రాస్తారోకోను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ, జేఏసీ నేతలను అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి వచ్చి అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తుండగా నిరసనకారులు అడ్డుకొని కొంతసేపు నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పోలీసులకు, నిరసనకారులకు పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. భారీ సంఖ్యలో చేరుకున్న పోలీస్ బలగాలు కొంత సమయం తరువాత డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణతోపాటు పలువురు నాయకులను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు బలవంతంగా తీసుకొని పోయారు. ఈ సందర్భంగా అడ్డుకున్న కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. కొంతమంది రోడ్డుపైనే బైఠాయించగా, మరికొందరు మహిళలు, యువకులు మన్ననూర్‌లోని పోలీస్‌స్టేషన్ ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అరెస్టు చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి అదుపుతప్పుతుందనే ఉద్దేశంతో అరగంట తరువాత అరెస్టు చేసిన నేతలను పోలీసులు వదిలిపెట్టడంతో నిరసన కారులు శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. యురేనియం తవ్వకాలతో జరిగే అనార్థాలపై రాస్తారోకో కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, జేఎసీ నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా నల్లమల కళాకారుల వేదిక వారు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, ఎంపీపీ అవుట శ్రీనివాసులు, జేఏసీ కన్వీనర్ నాసరయ్య, యురేనియం వ్యతిరేక పోరాట కన్వీనర్ దాసరి నాగయ్య, జేఎసీ, కాంగ్రెస్ నాయకులు ద్రోణాచారి, బాలకిష్ఠయ్య, రహీం, లింగం, మల్లికార్జున్, జడ్పీటీసీ ఆనురాధలతోపాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. డీఎస్పీ ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎస్సైలు, పోలీసులు భారీ సంఖ్యలో చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
చిత్రం...నల్లమలలో యురేనియం తవ్వకాలకు నిరసనగా శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించిన కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు