రాష్ట్రీయం

నేటి నుండి నెల్లూరులో రొట్టెల పండగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 9: నెల్లూరులో ప్రతియేటా నిర్వహించే రొట్టెల పండుగ మంగళవారం ప్రారంభం కానుంది. ప్రభుత్వం ఈ ఉత్సవానికి ప్రభుత్వ పండగ హోదా కల్పించిన నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఈ పండుగ ఈనెల 10 నుండి 14వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. నెల్లూరులోని బారాషాహిద్ దర్గా ప్రాంగణంలో నిర్వహించే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, కేరళ, దేశంలోని ఇతర ప్రాంతాలు, సౌదీ, కువైట్ తదితర దేశాల నుండి కూడా తమ కోర్కెల రొట్టెలు పట్టుకొని గంధ మహోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు వస్తుంటారు.
గతేడాది సుమారు 8 లక్షల మంది వరకు భక్తులు హాజరుకాగా ఈ ఏడాది 10 లక్షల వరకూ భక్తులు హాజరయ్యే అవకాశముందని అంచనా వేసిన అధికారులు ఆ స్థాయిలో అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిచేశారు. ఈ పండగకు హాజరయ్యే భక్తులు తమ కోర్కెలకు అనుగుణంగా రొట్టెలను వదులుతూ అందుకుంటుంటారు. రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువులో నీరు నిల్వ ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది విద్య, సౌభాగ్యం, సంతానం, ఉద్యోగ రొట్టెలకు ఎక్కువగా గిరాకీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10వ తేదీన ప్రారంభమయ్యే ఈ వేడుకలో భాగంగా 11న కీలకమైన గంధ మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి కడప దర్గా పీఠాధిపతి హాజరవుతారు. 12న రొట్టెల పండుగ, 13న తహలీల్ ఫాతేహ, 14న ముగింపు కార్యక్రమం జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సోమవారం నుండే ఇక్కడకు భక్తుల రాక ప్రారంభమైంది. దూరప్రాంతాల నుండి వచ్చే భక్తులు సేద తీరేందుకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 8 వేల చదరపు అడుగులతో జింక్ షీటింగ్ షామియానాలను ఏర్పాటు చేశారు. భక్తులు ఎంత పెద్ద సంఖ్యలో వచ్చినా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు స్పష్టం చేశారు. పండగ ఏర్పాట్లను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పాలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డిలు సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను పార్టీలకతీతంగా అందరివీ తొలగించాలని ఈ సందర్భంగా వారు అధికారులను ఆదేశించడం గమనార్హం.
చిత్రం... రొట్టెలు మార్చుకుంటున్న దృశ్యం