రాష్ట్రీయం

వైభవంగా గణనాథుని రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాల, సెప్టెంబర్ 9: స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి దేవస్థానం వారు కె.ఎత్తిరాజులునాయుడు, కాకర్లవారిపల్లి వారి జ్ఞాపకార్థం వారి కుమార్తె మీనాకుమారి, శివప్రసాద్‌నాయుడు, పూర్ణచంద్రనాయుడులు ఉభయదారులుగా వ్యవహరించారు. స్వామివారి మూలవిరాట్‌కు సాంప్రదాయబద్ధంగా అభిషేకం చేశారు. అనంతరం సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఉదయం సర్వాలంకార భూషితులైన సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఉత్సవమూర్తులనుల అనే్వటి మండపంలో ఉంచి విశేష సమర్పణ చేశారు. ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, మేళతాళాల మధ్య ఆలయం నుండి ఊరేగిస్తూ ఉభయదారుల ఉభయ వరుస వచ్చిన అనంతరం రథాన్ని ప్రత్యేకంగా అలంకరించి రథంలో స్వామివారిని అధిష్టించి కాణిపాకం పురవీధుల్లో రథాన్ని లాగారు. ఈ సందర్భంగా భక్తులు బొరుగులు, మిరియాలు, చిల్లర నాణేలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో దేముళ్లు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

చిత్రం... కాణిపాకం వీధుల్లో రథంపై ఊరేగుతున్న వినాయక స్వామివారు