రాష్ట్రీయం

తూర్పు నౌకాదళంలో స్లీనెక్స్-19 విన్యాసాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 10: భారత్- శ్రీలంక నౌకాదళాల సంయుక్త ఆధ్వర్యంలో స్లీనెక్స్-19 విన్యాసాలు ప్రారంభమయ్యాయి. తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 8న ప్రారంభమైన స్లీనెక్స్-19 కార్యక్రమానికి చీఫ్ స్ట్ఫా ఆఫీసర్ పునీత్ చంద్, శ్రీలంక నేవీ కమాండింగ్ నేవల్ ఫ్లీట్ ఫ్లాగ్ ఆఫీసర్ రియర్ అడ్మిరల్ ఏయూసీ డిసిల్వా సహా విన్యాసాలలో పాల్గొనే యుద్ధనౌకల కమాండింగ్ అధికారులు హాజరయ్యారు. హార్బర్ ఫేజ్ కార్యక్రమంలో భాగంగా ఇరు దేశాల నౌకాదళ సిబ్బంది మధ్య పలు అంశాలపై చర్చాగోష్ఠి జరిగింది. దీనిలో భాగంగా శ్రీలంక నేవీకి చెందిన యుద్ధనౌకలు సింధూరళా, సురనీమాలా ట్రైనీ అధికారులు భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ కుక్రి, ఐఎన్‌ఎస్ సుమేధాలను సందర్శించారు. అనంతరం శ్రీలంక నేవీ సిబ్బంది ఐఎన్‌ఎస్ డేగాను సందర్శించి యుద్ధ విమానాలు, హెలీకాఫ్టర్ల ఆపరేషన్ అంశాలను పరిశీలించారు. తరువాత ఈఎన్‌సీ ప్రధాన కార్యాలయంలోని సాముద్రికను సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీలంక హైకమిషనర్ ఆప్టిన్ సర్‌నేండోయో ముఖ్య అతిథిగా హాజరై ఐఎన్‌ఎస్ సుమేధ, ఐఎన్‌ఎస్ కుక్రి నౌకలను సందర్శించారు.
చిత్రం...స్లీనెక్స్ విన్యాసాలు-19లో పాల్గొన్న భారత్-శ్రీలంక అధికారులు