రాష్ట్రీయం

మహిళా గవర్నర్‌ను కించపరుస్తూ వ్యాఖ్యలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: తెలంగాణ ప్రథమ మహిళా గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజుల్లోనే ప్రభుత్వం వ్యవహరించిన తీరును కాంగ్రెస్, బీజేపీ తప్పుపట్టాయ. మంగళవారం ఇక్కడ బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు వేరువేరుగా నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారశైలిని దుయ్యబట్టారు. వీ హనుమంతరావు మాట్లాడుతూ నూతన మహిళా గవర్నర్‌ను కించపరిచే విధంగా సీపీఆర్‌వో వ్యాసం రాశారన్నారు. బీసీ వర్గాలకు చెందిన మహిళను అందరం గౌరవించుకోవాలన్నారు. ఇది సీఎంకు తెలియచేయకుండా జరిగిందా? అని ప్రశ్నించారు. ఒక సీపీఆర్‌వో ఇలా ఆర్టికల్ రాయవచ్చా? అని అడిగారు. ఒక మహిళా గవర్నర్ ప్రభుత్వాన్ని పొగుడుతుంటే, మీరు అవమానిస్తారా? అన్నారు. సీపీఆర్‌వోను బర్తరఫ్ చేయాలన్నారు. రోజురోజుకూ డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని, విష జ్వరాల వ్యాప్తిని అరికట్టడంపై ప్రభుత్వం శ్రద్ధ వహించాలన్నారు. బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, గవర్నర్ రాజ్యాంగబద్ధమైన పదవి అని, ఆ పదవిలో నియమితులైన వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందన్నారు. ప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్న అధికారి గవర్నర్ వ్యవస్థను కించపరిచే విధంగా వ్యాసం రాస్తే కేసీఆర్ వౌనంగా ఉన్నారన్నారు. కేసీఆర్‌కు తెలియచేయకుండా ఈ పని జరగదన్నారు. ఈ వ్యవహారంలో కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గవర్నర్ అంటే విషం కక్కినట్లుకనపడుతోందన్నారు. సర్కారియా కమిషన్ గవర్నర్ వ్యవస్థపై సిఫార్సు చేసి 40 ఏళ్లయిందన్నారు. గతంలో కేంద్రమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఏమి చేశారన్నారు. ప్రభుత్వంలో ఉన్న ఒక అధికారి ప్రభుత్వ వేతనాలు తీసుకుంటూ రాజ్యాంగ పదవిని అవమానపరిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించని పక్షంలో తమ పార్టీ న్యాయస్థానం ద్వారా చర్యలు తీసకుంటామన్నారు. ప్రవర్తనా నియమావళికి విరుద్ధమైన పనులు చేయరాదన్నారు. కౌన్సిల్ కూడా నిపుణులను , రాజకీయాలకు అతీతంగా ఉన్న వారిని నియమించాలని, కేసీఆర్ ఆ విధంగా చేస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం కాదా? అని ఆయన ప్రశ్నించారు.