రాష్ట్రీయం

వరద బాధితులకు తక్షణ సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 10: ఉభయ గోదావరి జిల్లాల్లో వరద బాధితులకు తక్షణం సాయం అందించాలని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. గోదావరి నదికి మళ్లీ వరదలు రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, తూర్పు గోదావరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో వరద పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ రంపచోడవరం ఏజెన్సీ ఏరియాలోని దేవీపట్నంలోని గ్రామాల్లో అన్ని సహాయక చర్యలు చేపట్టినట్టు తెలియజేశారు. వరద బాధితులకు ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.
ఆహార పొట్లాలతోపాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వరద బాధితులకు అందిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం వరద పరిస్థితి నిలకడగా ఉందని, ప్రస్తుత సమాచారం ప్రకారం రేపటికి వరద తగ్గే పురిస్థితి ఉందని తెలిపారు. పంట నష్టాలపై ఆయన మాట్లాడుతూ లోగడ వరదకే పంట నష్టాలను అంచనాలు వేశామని, కొత్తగా పంట నష్టం ఏమీ లేదని తెలిపారు. వరదల వల్ల నష్టపోయిన ఇళ్లను కూడా సర్వే చేయించామన్నారు. రేపటి సాయంత్రం లోగా ఏజెన్సీ ఏరియాలో విద్యుత్ పునరుద్ధరించడం జరుగుతుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు మాట్లాడుతూ ప్రస్తుత వరద వల్ల ఇళ్లలోకి నీరు రాలేదని, రోడ్ల పైకి వచ్చాయన్నారు. వరదలకు సంబంధించిన ప్రతీ గ్రామాల్లోనూ, ప్రతీ నివాస ప్రాంతానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్టు తెలిపారు మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ అవసరాన్ని బట్టి జిల్లా అధికారులు ఎప్పటికపుడు చర్యలు తీసుకోవాలన్నారు.