రాష్ట్రీయం

యురేనియం కర్మాగారం రోగాలకు నిలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల రూరల్, సెప్టెంబర్ 10: యురేనియం కర్మాగారం నుంచి వెలువడుతున్న విషవాయువులు, కలుషిత నీటివల్ల రోగాల బారినపడుతున్నామని, గర్భిణులకు అబార్షన్లు అవుతున్నాయని, భూగర్భజలాలు పాతాళాన్నంటాయని, నీళ్లు తాగితే చర్మవ్యాధులు ప్రబలుతున్నాయని పలు గ్రామాల ప్రజలు వాపోయారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఆర్.తుమ్మలపల్లెలో ఉన్న యురేనియం కర్మాగారం వల్ల ప్రజలు రోగాలబారిన పడుతుండడంపై వాస్తవాలు తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్యుల బృందం రెండోరోజు మంగళవారం పర్యటించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు బృందం సభ్యులు బాబావల్లి, సురేష్, శ్యామల, నాగేవ్వరరావు, మోహన్‌రావు, మధుసూదన్‌రెడ్డి, ప్రభుద్దీన్, వెంకట్‌సంపత్ సోమవారం యురేనియం కర్మాగారాన్ని సందర్శించారు. మంగళవారం కర్మాగారం పరిసర గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. కణంపల్లి, భూమయ్యగారిపల్లె, మొబ్బుచింతపల్లె, కెకె కొట్టాల, తుమ్మలపల్లి, రాచకుంటపల్లి గ్రామాల ప్రజలు కమిటీ సభ్యులకు తమ కష్టాలు ఏకరవుపెట్టారు. గతంలో బోర్లు వేసినప్పుడు 150 అడుగుల్లో నీరు వచ్చేదని, యురేనియం కర్మాగారం ఏర్పాటయిన తరువాత 500 నుండి 1500 అడుగుల వరకు బోర్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బోర్లు వేసినా నీరు అంతంతమాత్రంగా వస్తున్నాయని, సుమారు 500 అడుగులు లోతు నుంచి వచ్చే నీరు వాడుతుండడంతో చాలా రోగాలు ప్రబలుతున్నాయని, ఈ నీళ్లుతో పండించిన పంటలు సైతం ఎండిపోతున్నాయని, కాపు రావడం లేదన్నారు. కలుషిత నీరు తాగిన జీవాలు రోగాల బారినపడుతున్నాయని, చనిపోతున్నాయని విలపించారు. కర్మాగారం నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల గర్భవతులకు మూడునెలలు దాటగానే అబార్షన్ అవుతోందని పలువురు మహిళలు తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులు ఆయా గ్రామాల్లోని పంట పొలాలను పరిశీలించారు. అనంతరం కమిటీ సభ్యులు విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఆదేశానుసారం కాలుష్య నియంత్రణ మండలి తరఫున యురేనియం కర్మాగారాన్ని సందర్శించామన్నారు. మొదటిరోజు టెయిల్‌పాండ్, యురేనియం ప్రాజెక్టును పరిశీలించామని, మంగళవారం బాధిత గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నామన్నారు. దీనిపై నివేదిక తయారుచేసి ముఖ్యమంత్రి, కాలుష్య నియంత్రణ మండలికి అందజేస్తామని కమిటీ సభ్యుడు బాబావల్లి తెలిపారు.