రాష్ట్రీయం

వైభవంగా త్రిశూల స్నానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాల, సెప్టెంబర్ 11: వినాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం వైభవంగా త్రిశూల స్నానం నిర్వహించారు. తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ అనే్వటి మండపంలో ఉంచి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం యాగశాలలోని పుట్టమన్నులో వేసిన అంకురాలను మంగళవాయిద్యాల మధ్య స్వామివారి పుష్కరిణిలో కలిపారు. తదుపరి పుష్కరిణి వద్ద స్వామివారి త్రిశూలానికి సాంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించి దీప ధూప నైవేద్యాలు సమర్పించారు. వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకం చేసి పుష్కరిణిలో త్రిశూల స్నానం జరిపించారు. అంతకుముందు ధ్వజావరోహణం నిర్వహించారు.
కోలాహలంగా వసంతోత్సవం
ధ్వజావరోహణం సందర్భంగా బుధవారం కాణిపాకం ఆలయ ఉభయదారులు ఆలయ సిబ్బంది ఆనందంతో వసంతోత్సవాలు జరుపుకున్నారు. త్రిశూల స్నానం అనంతరం పుష్కరిణిలో మునిగి రంగులు చల్లుకున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈవో దేముళ్లు, ఎసి కస్తూరి, ఎఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, రవీంద్రబాబు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
వైభవంగా వడాయత్తు ఉత్సవం
వరసిద్ధి వినాయకస్వామి వారికి బుధవారం సాయంత్రం వైభవంగా వడాయత్తు ఉత్సవం నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో ఆఖరి రోజున వడాయత్తు ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవానికి కాకర్లవారిపల్లికి చెందిన ఉమాపతినాయుడు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉత్సవాల్లో అలసిన స్వామివారి మూలవిగ్రహానికి పాలు, పెరుగు, నెయ్యి, పంచామృతాభిషేక ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారికి ఉద్దిపప్పు వడలు, పెసరపప్పు పాయసం నైవేద్యంగా సమర్పించారు. దీప ధూప నైవేద్యాలతో విశేష సమర్పణ చేశారు. భక్తులకు స్వామివారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలను భక్తులకు అందచేశారు.
ఏకాంత సేవలో వినాయకుడు
నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజున రాత్రి స్వామివారికి ఏకాంత సేవ నిర్వహించారు. ఈ ఉత్సవానికి కాణిపాకంకు చెందిన సోమశేఖర్‌రెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉత్సవాల్లో అలసిన సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఉత్సవ మూర్తులకు ఏకాంత సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఊంజల్ సేవ చేపట్టారు.
చిత్రం...కాణిపాకం వినాయకస్వామి ఆలయంలో ధ్వజారోహణం నిర్వహిస్తున్న దృశ్యం