రాష్ట్రీయం

కౌస్త్భుంలో గదుల కేటాయింపు కేంద్రం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 11: తిరుమలలోని కౌస్త్భుం వసతి సముదాయంలో 2వ అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన గదుల కేటాయింపు కౌంటర్‌లో బుధవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం కౌస్త్భుంలోని 3వ అంతస్తులోని గదుల కేటాయింపు కేంద్రాన్ని 2వ అంతస్తుకు మార్చారు.
ఈ కౌంటర్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై ప్రతిరోజు 230 గదులు కేటాయిస్తున్న విషయం విదితమే. ఈ పూజా కార్యక్రమంలో ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓ పార్వతి, ఏఈఓ నారాయణ, సూపరింటెండెంట్ రామచంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.