రాష్ట్రీయం

అడుగడుగునా నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ప్రశాంత వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనం నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎం.మహేందర్ రెడ్డి తెలిపారు. వినాయక నవరాత్రి వేడుకల్లో ఇప్పటి వరకు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదని, ఆయా ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా సాగిందన్నారు. రాష్ట్రంలో గురువారం జరుగనున్న వినాయక నిమజ్జనం ఏర్పాట్లు, పోలీసు బందోబస్తుపై డీజీపీ, శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ డాక్టర్ జితేందర్‌తో కలిసి డీజీపీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ వినాయ నవరాత్రి ఉత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష విగ్రహాలను ఏర్పాటు చేశారని, వాటిలో ఇప్పటి వరకు వివిధ దశల్లో 50 వేల విగ్రహాలను నిమజ్జనం చేశారు. భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం కోసం అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నిర్వహించే వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా సీసీ కెమెరాలను ఎర్పాటు చేసి డీజీపీ కార్యాలయంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశామన్నారు. వినాయక నిమజ్జనంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను బందోబస్తు కోసం నియమించిన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఎస్పీలు, కమిషనరేట్‌లలో ప్రత్యేక పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ఎర్పాటు చేసి నిమజ్జనం ఊరేగింపును వీక్షిస్తామన్నారు. ప్రత్యేకంగా హైదరాబాద్‌లో నిర్వహించే వినాయక నిమజ్జనం ఊరేగింపును వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా భద్రతపరంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రధానంగా ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో వంద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. నగరవ్యాప్తంగా నిర్వహించే నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటిని పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయడంతో నిమజ్జనంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్న వెంటనే ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకునేలా చర్యలు తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్‌ను కలపుకొని మొత్తం మూడు కమిషనరేట్ల పరిధిలో 35 వేల మంది పోలీసులను బందోబస్తులో నియమించినట్లు తెలిపారు. బాలాపూర్ నుండి ప్రారంభమయ్యే వినాయక ప్రధాన నిమజ్జన ఊరేగింపు నగరంలోని 18 రూట్‌లలో నిమజ్జన ఊరేగింపు కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు నిమజ్జనం చూసేందుకు వీలుగా వసతులు కల్పిస్తున్నట్లు, నిమజ్జనంపై ఎలాంటి వదంతులు, పుకార్లు సృష్టించవద్దని, ఆలాంటి పనులు ఎవ్వరైనా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహేందర్ రెడ్డి హెచ్చరించారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఉన్న సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి తగిన పోలీసు పికెట్‌లను ఎర్పాటు చేశామన్నారు. నిమజ్జనం 24 గంటలు కొనసాగుతుందని తెలిపారు. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో లైటింగ్ సిస్టమ్‌తో పాటు నీటివసతి ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌లో సీసీటీవీల పర్యవేక్షణ ఉంటుందని, ప్రతి పోలీస్ స్టేషన్‌తో పాటు మూడు కమిషనరేట్లు, డీజీపీ కార్యాలయంలో పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు డీజీపీ వివరించారు.

చిత్రం...వినాయక నిమజ్జనం ఊరేగింపు వివరాలు వెల్లడిస్తున్న డీజీపీ మహేందర్ రెడ్డి