రాష్ట్రీయం

టాప్ 300 వర్సిటీల్లో తెలుగు రాష్ట్రాల వెనుకంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: ప్రపంచంలో అత్యుత్తమ 300 యూనివర్సిటీల్లో భారత దేశానికి చెందిన ఒక్క విశ్వవిద్యాలయం చోటు సంపాదించుకోలేదు. గత 8 ఏళ్లలో ఈ దుస్థితి ఎదురుకావడం ఇదే ప్రధమం. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ జాబితాలో ఉస్మానియా యూనివర్సిటీ 801-1000 ర్యాంకును, ఆంధ్రాయూనివర్సిటీ 1000ప్లస్ ర్యాంకును సాధించగా, ఆచార్య నాగార్జున వర్సిటీ 801-1000 ర్యాంకు దక్కించుకుంది. ఎస్వీయూ 801-1000 ర్యాంకును, బిట్స్ పిలానీ 1001 ప్లస్ ర్యాంకును, గీతం, కైట్ యూనివర్సిటీలు 1000 ప్లస్ ర్యాంకు సాధించాయి. 2012 ముందు కొన్ని వర్సిటీలు చోటు సంపాదించుకున్నా, ఈసారి ఆ ఖ్యాతిని దక్కించుకోలేకపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాను టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ విడుదల చేసింది. గతంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగలూరు సంస్థ తొలి 300 అత్యుత్తమ వర్సిటీల జాబితాలో చోటు సంపాదించుకున్నా ఈసారి అది 301 నుండి 350 ర్యాంకు మధ్యలోకి వచ్చేసింది.
ఐఐటీ రాయ్‌పూర్ సైతం 301 నుండి 350 మధ్య ఉంది. ఐఐటీ ఇండోర్ 351 నుండి 400 ర్యాంకు , ఐఐటీ ముంబై 401-500 మధ్య, ఐఐటీ ఢిల్లీ , ఐఐటీ ఖరగ్‌పూర్, 401 నుండి 500 మధ్య, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ 301-350, ఐఐటీ గాంధీనగర్ , ఐఐటీ రూర్కీలు సైతం 301 నుండి 350 మధ్య, అమ్రిత విశ్వవిద్యాలయం 601 నుండి 800 మధ్య ర్యాంకులు దక్కించుకున్నాయి. బెనారస్ హిందూ యూనివర్సిటీ , యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఐసర్, ఐఐటీ భువనేశ్వర్, ఐఐటీ గౌహతి, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్, జామియా మిలియా ఇస్లామియా, జేఎన్‌యూ, పంజాబ్ యూనివర్సిటీలు 601-800 ర్యాంకు సాధించాయి. కోల్‌కతా ఐసర్ 801-1000 ర్యాంకును,ఐఐటీ ధన్‌బాద్ సైతం 1000 ర్యాంకును సాధించాయి.