రాష్ట్రీయం

భావితరాలకు కాలుష్య తెలంగాణ ఇద్దామా?: పవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భావి తరాలకు బంగారు తెలంగాణ ఇస్తామా? యురేనియం కాలుష్య తెలంగాణ ఇస్తామా? అని ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. అన్ని ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు దీని గురించి ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు. యురేనియం తవ్వకాలపై కొద్ది రోజుల్లోనే రాజకీయవేత్తలు, మేథావులు, నిపుణులు, పర్యావరణ ప్రేమికులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.
1852 లో అమెరికాలో అప్పటి ప్రభుత్వం నివాస ప్రాంతా ల కోసం అడవులను కొనడానికి ప్రయత్నించినపుడు సియాటిల్ ప్రాంత ముఖ్య అధికారి రాసిన లేఖను ట్విట్టర్‌లో పవన్‌కల్యాణ్ ఉటంకించారు. ‘ మా భూమిని కొనాలని ఆకాంక్షిస్తున్నట్టు వాషింగ్టన్ నుండి అమెరికా అధ్యక్షుడు సమాచారమిచ్చాడు, కానీ గగనాన్ని కొనడమైనా, అమ్మడమైనా మీకెలా సాధ్యం? భూమి కొనాలనే ఆలోచనే మాకు విచిత్రం.
గాలిలోని స్వచ్ఛత, గలగల నీటి మిలమిలలు మా సొంతం కానపుడు వాటిని మీరెలా కొంటారు? ఈ భూమిపైన ప్రతి అణువు, మా ప్రజలకు అతి పవిత్రం, కాంతులీనే దేవదారువృక్షం సాగర తీరపు ఇసుక రేణువుల అణువణువూ నింగినంటే గగనాన్ని కనుమరుగు చేసే వృక్ష సంపదలపైన తెలి మంచు... అంటూ వారి పరిస్థితిని ముఖ్య అధికారి తన లేఖలో పేర్కొన్నారని పవన్ చెప్పారు.
పుడమిలో మేము భాగమైనట్టే మీరు ఈ అవనిలో భాగమేనని, ఈ భూమి తమకు ఎంతో అమూల్యమైనదని, అది మీకూ అమూల్యమేనని ఆయన పేర్కొన్నారని గుర్తు చేశారు. దేవుడు ఒక్కడే, ఎర్రటివాడా? తెల్లటివాడా అనే బేధంతో మనిషిని వేరు చేయరాదని, అంతమంగా అంతా సోదరులని గుర్తించాలని పేర్కొన్నారు.

*చిత్రం... జనసేన అధినేత పవన్‌కల్యాణ్