రాష్ట్రీయం

పార్టీ గుర్తులతోనే కంటోనె్మంట్ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: సికింద్రాబాద్ కంటోనె్నంట్ బోర్డు ఎన్నికలను పార్టీ గుర్తులతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుని హోదాలో రక్షణశాఖకు లేఖ రాశారు. ముఖ్యమంత్రి రాసిన లేఖను శుక్రవారం ఢిల్లీలో రక్షణశాఖ ఏస్టేట్ డైరెక్టర్ జనరల్ దీపా బజ్వాను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బో యినపల్లి వినోద్‌కుమార్, టీఆర్‌ఎస్ పార్టీ కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా కలిసి అందజేశారు. సికింద్రాబాద్ కంటోనె్మంట్ బోర్డుకు జనవరిలో ఎన్నికలు జరుగునున్నాయి. గతంలో బోర్డుకు జరిగిన ఎన్నికలను పార్టీ రహితంగా
నిర్వహించగా ఈ సారి పార్టీల గుర్తులతో నిర్వహించాలని లేఖలో కోరారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లోని కంటోనె్మంట్ బోర్డుల ఎన్నికలను పార్టీ గుర్తులతో నిర్వహించిన విషయాన్ని ఈ లేఖలో సీఎం గుర్తు చేశారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ రాసిన లేఖకు ఏస్టేట్ డైరెక్టర్ జనరల్ సానుకూలంగా స్పందించినట్టు వినోద్‌కుమార్ మీడియాకు తెలిపారు.
అమెరికా తెలంగాణ డవలప్‌మెంట్ ఫోరానికి సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం
అమెరికాలోని తెలంగాణ డవలప్‌మెంట్ ఫోరం (టీడీఎఫ్) 20వ వార్షికోత్సవానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ఫోరం ప్రతినిధులు ఆహ్వానించారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం ఫోరం అధ్యక్షురాలు కవిత చల్లా, వైస్ ప్రెసిడెంట్ రవి పల్లా, జయేందర్ ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానపత్రాన్ని అందజేశారు.