రాష్ట్రీయం

దశ, దిశ లేని 100 రోజుల పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు : వైసీపీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాలు జనరంజకంగా ఉన్నప్పటికీ పాలన మాత్రం జనవిరుద్ధంగా ఉందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత వైసీపీ ప్రభుత్వంపై స్పందించాల్సిన అవసరం, అవకాశం ఏడాది పాటు రావని భావించామని, అయితే మూడున్నర నెలల్లోనే మాట్లాడే పరిస్థితులు ఈ ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వైసీపీ 100 రోజుల పాలనపై జనసేన రూపొందించిన 33 పేజీల నివేదికను ఆయన విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణాల్లో ఇసుక దోపిడీ ఒకటని, గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళ్లిందన్నారు. ఇసుక దోపిడీని నిలువరిస్తాం, పారదర్శక పాలనతో తక్కువ ధరకే ఇసుకను అందిస్తామని హామీ ఇచ్చి వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. టన్ను ఇసుకను 375 రూపాయలకు అందిస్తామని చెప్పి స్టాకు యార్డుల్లో మాత్రం 900 రూపాయలకు విక్రయిస్తున్నారని, అధికంగా వసూలు చేస్తున్న రూ. 525 ఎవరి జేబులోకి వెళ్తున్నాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. మూడు నెలలు ఇసుక సరఫరా నిలిచిపోవడంతో వీరికి ఉపాధి లేకుండా పోయిందని, పనులు లేక పస్తులున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వైసీపీ 100 రోజుల పాలనలో దాదాపు లక్ష మంది ఉపాధి కోల్పోయారని, ఇది పూడ్చలేని నష్టమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.2.58 లక్షల కోట్ల అప్పు ఉందని, వైసీపీ ప్రకటించిన మ్యానిఫెస్టో అమలు చేయాలంటే మరో రూ.50 వేల కోట్లు అదనంగా కావాలన్నారు. కేంద్రప్రభుత్వం, కేంద్ర మంత్రులు వద్దని హెచ్చరిస్తున్నా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని, ఇలాంటి నిర్ణయాల వల్ల పెట్టుబడి దారుల విశ్వాసం కోల్పోతామన్న ఆలోచన లేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన కియా మోటార్స్ సంస్థ తన ప్లాంట్‌లో కార్యకలాపాలను ప్రారంభించడం అభినందించదగ్గ విషయమన్నారు. డీప్ సీ వాటర్ పోర్ట్ అయిన మచిలీపట్నం నౌకాశ్రయం భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టేశారన్నారు. పోలవరం టెండర్లు రద్దు చేశారని, అమరావతి నిర్మాణాలు నిలిపివేసి పెట్టుబడిదారుల్లో భయాందోళనలు సృష్టించారని విమర్శించారు. దీని కారణంగానే రూ.24 వేల కోట్ల పెట్టుబడితో 5 వేల మందికి ప్రత్యక్షంగా, 10 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన ఆసియా పల్స్ అండ్ పేపర్స్ అనే అంతర్జాతీయ సంస్థ తన ప్లాంట్‌ను ప్రకాశం జిల్లా నుండి మహారాష్టక్రు తరలిస్తోందన్నారు. పారిశ్రామిక వేత్తలను భయబ్రాంతులకు గురి చేస్తే పెట్టుబడులు ఎక్కడి నుండి వస్తాయంటూ ప్రశ్నించారు. పెట్టుబడిదారులు పంపించేసి కూడా ధైర్యంగా ఉన్నారంటే మీకు వేరే చోట నుండి డబ్బు వచ్చి ఉండాలని, తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో గానీ మీ పాలనలో విజన్ లోపించిందంటూ జగన్ విధానాలను పవన్ ఎత్తిచూపారు. విలేఖర్ల సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పొలిట్‌బ్యూరో సభ్యుడు అర్హం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... వైసీపీ 100 రోజుల పాలనపై రూపొందించిన పుస్తకాన్ని విడుదల చేస్తున్న పవన్ కళ్యాణ్