రాష్ట్రీయం

క్రీడా రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ: మంత్రి శ్రీనివాస్ గౌడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెంలగాణ రాష్ట్రం అన్ని రంగాలతో పాటు క్రీడా రంగంలో దూసుకుపోతుందని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స్టేట్ బాక్సింగ్ సంఘం ఆధ్వర్యంలో లాల్‌బహదూర్ స్టేడియంలో ఆదివారం 4వ ఎలైట్ మెన్ ఓపెన్ స్టేట్ బాక్సింగ్ సెలక్షన్ ట్రయల్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీలను సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి మంత్రి పోటీలను ప్రారంభించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న రాష్ట్ర క్రీడాకారులను ప్రభుత్వం ఎదో ఒక రూపంలో ఆదుకుంటుండంతో గ్రామీణ క్రీడాకారులు సైతం పోటీలో పాల్గొంటూ సత్తా చాటుతున్నారని తెలిపారు. ఈ పోటీలో ప్రతిభ కనపరిచిన వారిని ఎంపిక చేసి 4నుంచి 10 వరకు షిమ్లాలో జరుగనున్న ఈఎంఎన్ బాక్సింగ్ జాతీయ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ జట్టుకు ఎంపిక చేయనున్నట్లు నిర్వహకులు తెలిపారు.

*చిత్రం...లాల్‌బహదూర్ స్టేడియంలో ఆదివారం బాక్సింగ్ పోటీలను ప్రారంభిస్తున్న క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి