రాష్ట్రీయం

కోడెల మృతిపై సీబీఐ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్భువన్‌లో దివంగతనేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు భౌతికకాయానికి నివాళులు అర్పించిన తర్వాత ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ,
కోడెల మరణం ఒక షాక్ అన్నారు. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక అంశాలపై పోరాడానని, జగన్ ప్రభుత్వాన్ని ఏమని అభివర్ణించాలో తెలియడం లేదన్నారు. పారిశ్రామిక వేత్త పాయా ఈ ప్రభుత్వాన్ని టెర్రరిస్టు అన్నారన్నారు. ఈ ప్రభుత్వానికి లాజిక్ లేదని, టెర్రరిస్టుల కన్నా జగన్ ప్రభుత్వం ఎక్కువన్నారు. ఒక వ్యక్తిని ఒక షాట్‌లో టెర్రరిస్టులు చంపేస్తారని, ఈ మరణంలో బాధ ఉండదని చెప్పారు. కోడెల విషయంలో మానసికంగా, శారీరంగా, ఆర్థికంగా వేధించి దిక్కు తెలియని స్థితికి నెట్టి వేశారన్నారు. ఈ అవమానాలను చూసిన తర్వాత జీవించడం వృథా అనుకున్నారన్నారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు కోడెలను వేధించరన్నారు. రెండునెలల్లో జగన్ ప్రభుత్వం కోడెలపై 19కేసులను నమోదు చేసిందన్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కోడెలకు వ్యతిరేకంగా కేసులు పెట్టాలని ప్రచారం చేశారన్నారు. కోడెలపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడిందని, ఈ అంశంపై చర్చ జరగాలన్నారు. తనపైన గతంలో 26 కేసులను నమోదు చేసి రుజువు చేయలేకపోయారన్నారు. తన ఇంటి పక్కన ఉన్న ప్రజావేదికను కూల్చేశారన్నారు. తన భద్రతను కుదించారన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నన్నపనేని రాజకుమారి, అచ్చెన్నాయుడు ఏ తప్పు చేయలేకపోయినా గురజాలకు బీజేపీ అధ్యక్షుడు కన్నా వెళితే అరెస్టు చేయడమేంటని ఆయన అన్నారు. తాను 11 మంది ముఖ్యమంత్రులను చూశానని, తాను ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నానని, ఇలాంటి ఘటనలను ఎప్పుడూ చూడలేదన్నారు. ఇది ప్రభుత్వ హత్య అన్నారు. దీనిపై ప్రతి ఇంట్లో చర్చించాలన్నారు. ప్రజాస్వామ్యవాదులు ఈ సంఘటనలను ఖండించాలన్నారు.
కోడెలకు నివాళులు అర్పించిన మైసూరా
డాక్టర్ కోడెల శివప్రసాదరావు భౌతిక కాయానికి మాజీ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త డాక్టర్ మైసూరా రెడ్డి నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం ఆయన ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు వెళ్లి కోడెల భౌతిక కాయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కోడెలతో ఉన్న తన అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకున్నారు.
*చిత్రం... విలేఖరులతో మాట్లాడుతున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు