రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 18: పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని అనుకుని ఉన్న దక్షిణ కోస్తాతీరంలో 5.8 కిమీ ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మరో 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు బుధవారం తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి పశ్చిమ దిశ నుంచి గంటకు 45 నుంచి 50 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.