రాష్ట్రీయం

బోటులో 77 మంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 20: ప్రైవేటు బోటు యజమానుల ఆన్‌లైన్ టిక్కెట్లు, బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు గత ఆదివారం గోదావరిలో ప్రమాదానికి గురైన బోటులో 77 మంది ఉండి ఉండవచ్చని భావిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. బోటులో ఇంకా ఎవరైనా ఉన్నారనే సమాచారం ఉంటే బంధువులు తెలియజేయలని కోరారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద శుక్రవారం మంత్రి కన్నబాబు బాధితులు, వారి బంధువులను పరామర్శించారు. ఈసందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వారం రోజులుగా బోటు ప్రమాదం సహాయ చర్యల్లో యంత్రాంగం నిమగ్నమై వుందని, అత్యంత లోతైన కచ్చులూరు మందం అనే ప్రాంతంలో ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 77 మంది చిక్కుకున్నారని తెలిసిందని, స్థానికుల సాయంతో 26 మంది సురక్షితంగా బయటపడ్డారని, గల్లంతైన వారిలో ఇప్పటివరకు 35 మృతదేహాలను వెలికితీశారని, ఇంకా 16మంది ఆచూకీ తెలియాల్సివుందన్నారు. వీరిలో రాష్ట్రానికి చెందిన తొమ్మిదిమంది, తెలంగాణకు చెందిన ఏడుగురు ఉన్నారన్నారు. ముందుగా బాధితుల బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు 73 మంది ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్టుగా గుర్తించామని మంత్రి పేర్కొన్నారు. బోటును వెలికితీసే ఆపరేషన్ కొనసాగుతోందని, ఎక్కడ నిపుణులుంటే అక్కడ నుంచి రప్పించామన్నారు. కాకినాడలోని అనుభవజ్ఞులైన మత్స్యకారులను సైతం రప్పించామన్నారు. నౌకాదళంతోపాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ముంబై తదితర ప్రాంతాల నుండి నిపుణులు వచ్చారన్నారు. సోనార్ పరికరం ద్వారా 250 అడుగుల లోతులో బోటు ఉన్నట్టు గుర్తించామన్నారు. వరద నీరు బురదమయమై ఉండటంతో సోనార్ పరికరంతో కూడా స్పష్టంగా గుర్తించే పరిస్థితి లేదన్నారు. గోదావరి మధ్యలో బోల్తాపడటంవల్ల క్రేన్లు ఉపయోగించే పరిస్థితి లేదన్నారు. బోటును కదపగలిగితే, అందులో చిక్కుకున్న వారి మృతదేహాలు బయటపడే అవకాశముందని భావిస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారన్నారు. ఎంత ఖర్చయినా బోటును వెలికి తీయాలని, ప్రతి ఒక్క మృతదేహాన్ని అప్పగించేంత వరకు బాధ్యత వహించాలని అధికారులను ఆదేశించారన్నారు. ప్రమాదంపై విచారణ కమిటీని నియమించారని, 21 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారన్నారు. పర్యాటక శాఖ మంత్రి కూడా బోట్ల రక్షణ, భద్రతకు సంబంధించి ఒక సమగ్ర ప్రణాళిక విడుదలచేస్తారన్నారు. మరోవైపు ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణ జరిపిస్తున్నామని, ఉన్నత స్థాయి కమిటినీ వేసి, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా శాశ్వత రీతిన తీసుకోవాల్సిన భద్రత, జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం తాజాగా భద్రత, రక్షణ ప్రధానాంశంగా జల రవాణాకు కొత్త విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తోందన్నారు. ప్రమాద సమయంలో 26మంది ప్రాణాలు కాపాడిన కచ్చులూరు ఆదివాసీల సాహసాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అభినందించారన్నారు. ప్రమాదం జరిగినప్పటిక నుంచి వైద్యులు, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు 24 గంటలూ పనిచేస్తున్నారన్నారు. ఇంకా ఎవరైనా ఈ ప్రమాదం ఇరుక్కున్నట్టు వుంటే సమాచారాన్ని అందించవచ్చని ప్రభుత్వం తరపున కోరుతున్నామన్నారు. ఈ ప్రమాదంలో కుక్ హెల్పర్ కర్రి మణికంఠ కూడా ఉన్నట్టు తెలిసిందన్నారు. విమర్శలు చేయడం సమస్యకు పరిష్కారం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. పర్యాటక శాఖ మంత్రి ఆ శాఖ బోట్లు తిరగకూడదని ఆపేస్తే, ప్రైవేటు బోట్లు గురించి ఎందుకు సిఫార్సుచేస్తారని మరో ప్రశ్నకు మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు.