రాష్ట్రీయం

అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ దూసుకుపోతోందని, అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రతి పౌరుడు అంకితభావంతో పనిచేయాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ హైదరాబాద్ సైబర్ కనె్వంన్షన్ సెంటర్‌లో ప్రాజెక్టు మేనేజిమెంట్‌పై ఏర్పాటు చేసిన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగ ఆయన ప్రాజెక్టు రిపోర్టుపై నివేదికను విడుదల చేశారు. భారతదేశంలో గ్రామాల్లో జీవిస్తోందన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న భారతదేశంలో స్థానిక సంస్థల ద్వారా అభివృద్ధి సాధ్యమవుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల అనుసంధానం కోసం కేంద్రం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమం కింద 6 లక్షల కి.మీ గ్రామీణ రహదారులను నిర్మించిందన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉద్యమంగా కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమానికి అన్నివర్గాల ప్రజలు, రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా పాల్గొంటున్నారన్నారు. ప్రపంచంలో అతి పెద్ద గృహ నిర్మాణ కార్యక్రమమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలు దిగ్విజయంగా అమలవుతున్నాయన్నారు. పట్టణాభివృద్ధి శాక చేపట్టిన స్వచ్ఛ భారత్, స్మార్ట్ సిటీస్ లాంటి పథకాలకు ప్రజలు నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే సామాజిక పథకాలు జయప్రదమవుతాయన్నారు. మహిళా సాధికారత గురించి ఆయన వివరించారు.
*చిత్రం... హైదరాబాద్‌లో శనివారం జరిగిన సదస్సులో ప్రాజెక్టు రిపోర్టుపై నివేదికను
విడుదల చేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు