రాష్ట్రీయం

గ్రూప్-1 కేసు మే 3కు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ఏపిపిఎస్‌సి (2011)గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ మే 3 తేదీకి వాయిదా పడింది. సుప్రీంకోర్టు న్యాయముర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రేలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. పరీక్ష నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం తమ వైఖరి తెలియజేయాడానికి రెండు వారాల గడుపుకావాలని కోర్టును కోరగా సుప్రీంకోర్టు దానికి అంగీకరించింది. రాష్ట్ర విభజన అనంతరం తమ కోటాలో భాగంగా మెయిన్స్ పరీక్ష నిర్వహించేందుకు తాము సిద్ధమని ఏపిపిఎస్‌సి తరఫున న్యాయవాది దుష్యంత్ దవే, కమిషన్ తరఫున గుంటూరు ప్రభాకర్ కోర్టుకు తెలిపారు. దీనిపై నిర్ణయం తీసుకోడానికి తమకు రెండు వారాల గడువుఇవ్వాలని టిపిపిఎస్‌సి తరఫు న్యాయవాది రత్నం బెంచ్‌ను కోరారు. 2011లో ఏపిపిఎస్‌సి నిర్వహించిన గూప్-1 పరీక్ష ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రంలో చోటుచేసుకున్న ఆరు తప్పులు మూలంగా కొంతమంది అభ్యర్థులు నష్టపోయారు. ఆ అభ్యర్ధులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ సమస్యకు పరిష్కరం చూపాలంటూ హైకోర్టు యుపిఎస్‌సికి సిఫార్సు చేసింది. కాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఏపిపిఎస్‌సి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో మళ్లీ పరీక్షను నిర్వహించాలని సుప్రీంకోర్టు 2013లో అక్టోబర్ 7 తేదీనాడు తీర్పునిచ్చింది. అయినా ఇంతవరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహిచలేదంటూ అభ్యర్థులు కోటేశ్వరరావు, శైలజ సుప్రీం కోర్టులో కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై పూర్తిస్థాయిలో వాదనలు వింటామని తదుపరి విచారణను మే 3 తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.