రాష్ట్రీయం

మెరుగైన వైద్యం అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, సెప్టెంబర్ 22: గ్రామీణ ప్రాంతమైన శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్ గ్రామ సమీపంలో స్వర్ణ భారతీ ట్రస్ట్ ద్వారా నిరుపేద ప్రజలకు ఉచితంగా వైద్యం అదించడం ఎంతో హర్షనీయమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం ముచ్చింతల్ గ్రామ సమీపంలోని స్వర్ణ భారతీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని, రైతు నేస్తం కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ప్రతి ఒక్కరిని ఆరోగ్యమస్తు, ఆయుష్మాన్‌భవ అని దీవించ గలిగే గొప్ప సంస్కారం నేర్పింది. మన శరీరాన్ని దృఢంగా ఉంచుకొగలిగినప్పుడే మన పనులు చకచకా చేసుకుంటామని, విదేశీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని అన్నారు. గవర్నర్ మాట్లాడుతూ స్వర్ణ భారతి అందిస్తున్న సేవలు ఎంతో బాగున్నాయని కొనియాడారు. వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచిత మందులు అందజేయడం హర్షనీయని అన్నారు. రైతు లేనిదే దేశం లేదని వారి ప్రతిభను ప్రతి ఒక్కరు గుర్తించాలని, ప్రతి ఒక్కరు వ్యవసాయంలో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డా.జివి రామాంజనేయులు, డాక్టర్ బాబురావు నాయడు, డాక్టర్ భాస్కర్‌రావు, మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్‌రావు, కామినేని శ్రీనివాస్‌రావు హాజరయ్యారు.
ఇదే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముప్పవరపు ఫౌండేషన్ రైతు నేస్తం సంస్థ సంయుక్త నిర్వహణలో జరిగిన రైతు నేస్తం పురస్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ దేశ జనాభాలో 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నందున కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ప్రాధాన్యత క్రమంలో తొలిస్థానం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి వ్యవసాయం అనేది భారతీయ సంప్రదాయం వ్యవసాయ పద్ధతని, పురుగుల మందుల దుష్ప్రభావం నుంచి వినియోగదారులను కాపాడే ఈ విధానం అత్యుత్తమ వ్యవసాయ విధానంగా భావిస్తానన్నారు. రైతు నేస్తం జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న వ్యవసాయ శాస్తవ్రేత్త డాక్టర్ జీవీ రామాంజనేయులు, కృషి రత్న పురస్కారం అందుకున్న ఐఎఎస్ అధికారి డాక్టర్ టీ బాబూరావు నాయుడును ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

*చిత్రం... ఉచిత వైద్య శిబిరంలో మాట్లాడుతున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు