రాష్ట్రీయం

తనిఖీలతో విద్యాసంస్థల బెంబేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: విద్యాసంస్థల ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం నడుం బిగించడంతో ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలన్నీ ఏకమై బంద్ హెచ్చరికలు జారీ చేశాయి. గత పదేళ్లుగా ఏ ఏడాదికా ఏడాది ప్రమాణాలపై హామీ ఇస్తూ వస్తున్న యాజమాన్యాలు అందుకు తగ్గ చర్యలు చేపట్టకపోగా, ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఏటా ఉల్లంఘించడం, చివరి నిమిషంలో కొన్ని సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయించి మొత్తం అడ్మిషన్ల వ్యవహారాన్ని వివాదాస్పదం చేయడం అలవాటుగా మారిపోయింది. అన్నింటికీ మించి అన్ని విద్యాసంస్థలు వెబ్‌పోర్టల్స్ నిర్వహించి పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, విద్యార్థుల వివరాలు, వౌలిక సదుపాయాలు, సౌకర్యాలకు సంబంధించి, సంస్థ కమిటీ వివరాలు, అకడమిక్ బోర్డు వివరాలు, ఫలితాలు, క్యాంపస్ రిక్రూట్‌మెంట్ వంటి వివరాలు ఉంచాలని ప్రభుత్వం ఆదేశించినా కొన్ని సంస్థలు మాత్రం నామమాత్రంగా పోర్టల్స్ పెట్టినా ఏ రోజుకా రోజు అవి అప్‌డేట్ కావడం లేదు. యాజమాన్య సీట్లకు ఆన్‌లైన్‌లో మెరిట్ పద్ధతిన భర్తీ చేయాలనే ప్రభుత్వ నిబంధనను సైతం గాలికి వదిలేశాయి. అప్షన్ల సమయంలో యాజమాన్యాలు పేరుకు నోటిఫికేషన్ వెబ్‌లో ఉంచినా, ఆన్‌లైన్ అడ్మిషన్లకు అవకాశం లేకుండా పోర్టల్ లింక్‌లను తొలగిస్తున్నాయి. అలాగే యాజమాన్యానికి సంబంధించి ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలు ఉంచాలని ఎఐసిటిఇ, యుజిసి సూచిస్తున్నా దానిని సైతం గాలికి వదిలేశాయి. ఇన్ని సమస్యలున్నా తమకేమీ పట్టనట్టు యాజమాన్యాలు వ్యవహరిస్తుండగా వారిని దారికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే కాలేజీలను మూసివేస్తామనే హెచ్చరికలను యాజమాన్యాలు చేస్తున్నాయి. సోమవారం నుండే కాలేజీలను మూసివేస్తామని చెప్పిన యాజమాన్యాలు మంగళవారం నాడూ అదే పాట పాడాయి. అన్ని స్థాయిలకు చెందిన 6340 విద్యాసంస్థలు బంద్‌లో పాల్గొన్నాయని, పరీక్షలను బాయ్‌కాట్ చేశామని తెలంగాణ విద్యాసంస్థల జాక్ నేతలు గౌతంరావు, జి రమణారెడ్డి, సూరం ప్రభాకరరెడ్డి, డాక్టర్ రామ్‌దాస్ తెలిపారు. ఎన్‌ఫోర్సుమెంట్ దాడులు, పోలీసుల దాడులు ఆపకుంటే తాము విద్యాసంస్థల బంద్ కొనసాగిస్తామని డాక్టర్ కె. రామ్‌దాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.