రాష్ట్రీయం

టిఆర్‌ఎస్‌తో మైత్రి ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: తెలంగాణలో పార్టీ బలోపేతానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని బిజెపి నూతన సారథిగా నియమితులైన డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితితో తమకు ఎటువంటి వైత్రి ఉండబోదని ఆయన చెప్పారు. బిజెపి అధ్యక్షునిగా తనను నియమించినందుకు ఆయన ఇటీవల ఢిల్లీకి వెళ్ళి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమీత్‌షాను, ఇతర ముఖ్య నేతలను కలిసి కృతజ్ఞతలు తెలిపి సోమవారం సాయంత్రం తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వరకూ ఊరేగింపుగా వచ్చారు.
విమానాశ్రయం వద్ద తనను కలిసిన విలేఖరులతో డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. తాను ఈ నెల 22న పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తానని ఆయన తెలిపారు. వచ్చే నెలలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమీత్‌షా హైదరాబాద్‌కు రానున్నారని ఆయన తెలిపారు. టిఆర్‌ఎస్‌తో మైత్రీ విషయంలో అడిగిన ప్రశ్నను ఆయన తోసిపుచ్చారు. ఇప్పుడు పార్టీని మరింత బలోపేతం చేసే విషయంపై దృష్టి సారిస్తున్నామే తప్ప ఇతర పార్టీలతో మిత్రత్వం కోసం ఆలోచన చేయడం లేదని అన్నారు. పార్టీలో అందరినీ కలుపుకుని పోతానని ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు టిఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విస్మరిస్తే ప్రజా ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

చిత్రం ఢిల్లీనుంచి హైదరాబాద్ వచ్చిన బిజెపి తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలుకుతున్న కార్యకర్తలు