రాష్ట్రీయం

జగన్ విధానాలతో రాష్ట్రానికి సరిదిద్దలేని నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 11: ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రానికి సరిదిద్దలేనంత నష్టం జరుగుతోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రెండు రోజుల విశాఖ పర్యటన ముగింపు సందర్భంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీపీఏల రద్దు, రివర్స్ టెండరింగ్ విధానం, అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిలిపివేత సహా నదుల అనుసంధానంలో తీసుకుంటున్న పలు నిర్ణయాలు భవిష్యత్‌లో రాష్ట్రానికి, ప్రజలకు చేటు కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి మిగులు జలాలను వాడుకునే అవకాశం ఉన్న మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రం చేతిలో పెట్టేలా తెలంగాణ భూ భాగంలో 400 కిమీ మేర కాలువలు, లిఫ్ట్‌లు నిర్మించడం అంటే భవిష్యత్‌లో నీటి కోసం యుద్ధాలు చేసుకునే పరిస్థితులు కొని తెచ్చుకోవడమేనన్నారు. గోదావరిని శ్రీశైలంతో అనుసంధానం చేస్తామంటున్న జగన్ నిర్ణయంపై మేథావులు, నీటి పారుదల నిపుణులు అభ్యంతరం చెపుతున్నా మొండిగా ముందుకు వెళ్లాలన్న తీరు ప్రజలకు శాపంగా మారబోతోందన్నారు. దీని కంటే నాగార్జున సాగర్ నుంచి నల్లమల్ల టనె్నల్ ద్వారా బనకచర్ల రిజర్వాయర్‌కు తరలించగలిగితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాయలసీమ అంతటా నీరందించవచ్చన్నారు. జగన్ నిర్ణయాల వల్ల రాష్ట్ర ఇమేజ్ దెబ్బతింటోందన్నారు. అమరావతి ద్వారా సంపద సృష్టించి, దాన్ని ప్రజలకు పంచే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం సరైన ఆలోచన చేయట్లేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై టీడీపీ అవిశ్రాంత పోరాటం చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా భ్రష్ఠుపట్టిపోయిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీల పట్ల ఎలా వ్యవహరించాలో పోలీసులకు కొత్తగా నియమావళి తీసుకురావాలా అని ప్రశ్నించారు. కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులపై కేసులు పెట్టలేమా అని నిలదీశారు. ఏ చట్టం ప్రకారం నిరసనకారులపై కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. అధికార పార్టీ ఆదేశించిన మేరకు రాజకీయ పార్టీల హక్కులు కాలరాస్తే సహించమన్నారు. మీ చర్యల వల్ల పోలీసు వ్యవస్థ విశ్వసనీయత దెబ్బతింటోందన్నారు. తాను సీఎంగా ఉండగా ఇలా వ్యవహరిస్తే అసలు వైసీపీ అధికారంలోకి వచ్చేదా అని ప్రశ్నించారు. టీడీపీ సానుభూతి పరులు కాంట్రాక్టులు చేస్తే బిల్లులు చెల్లించమంటున్నారు. కేంద్రం విడుదల చేసిన నరేగా నిధులను పక్కదారి పట్టించారు. ఇంత దారుణంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని తాను ఎక్కడా చూడలేదన్నారు.
కార్యకర్తలకు పార్టీ తరపున న్యాయ సహాయం
అధికార వైసీపీ వేధింపులకు గురై పోలీసు కేసులు భరిస్తున్న కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. పోలీసులు పెట్టే కేసులను కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కొంటారని, ఇదే సందర్భంలో ప్రైవేటు కేసులు పెడితే వాదించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో న్యాయ సహాయం అందిస్తామన్నారు. దీనికోసం లాయర్లను నియమించడంతో పాటు ఆర్థికంగా కూడా ఆదుకుంటామన్నారు