రాష్ట్రీయం

అవినీతి జరిగితే బయటపెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, అక్టోబర్ 11: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపించినపుడు విచారణ జరిపి దోషులను బయటపెట్టకుండా, రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం ఏమిటని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యదర్శి సత్యకుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణం విచారణ జరిపి, దోషులపై చర్యలు తీసుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టును శుక్రవారం బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు సందర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బీజేపీ బృందం ప్రాజెక్టును సందర్శించింది.
ఈసందర్భంగా నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో సత్యమూర్తి మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, భూసేకరణలో అక్రమాలు జరిగాయని భారతీయ జనతాపార్టీ ఆరోపించిందని, అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇవే ఆరోపణలు చేసిందన్నారు. అయితే తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, నాలుగు నెలలు గడుస్తున్నా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఎందుకు బయటపెట్టడంలేదని ప్రశ్నించారు. ఆ సమయంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి, అవినీతిపరుల బాగోతం బయటపెడితే సరిపోతుందని, రివర్స్ టెండరింగ్ అవసరం ఏమిటని నిలదీశారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు తక్షణం ప్రారంభించి, రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని, రాజకీయాలకు పాల్పడతుండా నిర్మాణం పూర్తిచేయాలని సత్యమూర్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. విలేఖర్ల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పి మాధవ్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నరేంద్రమోదీ వరం అన్నారు. గత ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీ పేరిట డబ్బు దుర్వినియోగం చేసిందని, దానిపై విచారణ జరిపి దోషులను బహిర్గతపర్చాలన్నారు. పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనులకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని, వారికి భూమికి భూమి ఇవ్వాలన్నారు. నిర్వాసితులకు మెరుగైన పరిహారంతోపాటు మంచి ప్యాకేజీ అందించాలన్నారు. పునరావాసం, భూసేకరణలో అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరగాలన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో రాష్ట్ర పార్టీ నేతలు, జాతీయ నేతలు సమావేశమవుతున్న దృష్ట్యా ప్రాజెక్టు వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ పర్యటించామన్నారు. రాజకీయ లబ్ధికోసం ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోవాలని టీడీపీ కోరుకుంటోందని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలతో ప్రాజెక్టు మెగా కంపెనీకి నిర్మాణ బాధ్యతలు అప్పగించారని, ప్రస్తుతం ఆ సంస్థ తెలంగాణలో బాగా చేస్తోందని, ఏపీలో చేయడంలేదని విమర్శలు చేయడం దారుణమన్నారు. గతంలో జగన్ సైతం ఈ సంస్థపై పలు ఆరోపణలుచేసి, అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీకే నిర్మాణ బాధ్యతలు అప్పగించడాన్ని చూస్తుంటే, చంద్రబాబు, జగన్ ప్రాజెక్టును నాశనం చేస్తున్నారని సందేహం కలుగుతోందన్నారు. గతంలో టెండర్లలో అవినీతి జరిగిందని, జగన్ రివర్స్ టెండరింగ్‌కు వెళితే, రివర్స్ టెండరింగ్‌లో అవినీతి ఆని చంద్రబాబు ఆరోపిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితలను అధ్యయనంచేసి, కేంద్ర ప్రభుత్వం, జలవనరుల శాఖ దృష్టికి తీసుకెళతామన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగితే టీడీపీ, వైసీపీలదే బాధ్యతన్నారు. వారు రాష్ట్ర ప్రజల ముందు దోషులుగా నిలుస్తారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయడానికి బీజేపీ సహకరిస్తుందన్నారు.
ఉదయం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని కన్నా లక్ష్మీనారాయణతోపాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునిల్ దియోధర్, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ, రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి నిర్మలా కిషోర్, పరిమి రాధ, కరిబండి నాగరాజు తదితరులు సందర్శించారు. నిర్మాణ ప్రాంతానికి చేరుకుని, స్పిల్‌వేను పరిశీలించారు. ఈఈ శ్రీనివాస్, డీఈ బాలకృష్ణ ప్రాజెక్టు పనులను వారికి వివరించారు.