రాష్ట్రీయం

దసరా తిరుగు ప్రయాణికుల కోసం జనసాధారణ్ రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: దసరా పండుగ కోసం ఊళ్లకు వెళ్ళిన ప్రయాణికుల కోసం రైల్వే అధికారులు జనసాధారణ్ రైళ్లను నడుపుతున్నారు. ఈ రైళ్లు కర్నూలు, నిజామాబాద్‌కు ప్రత్యేక జనసాధారణ్ రైళ్లును తిప్పుతున్నారు. కాచిగూడ- నిజామాబాద్ 07013- 07014 రైళ్లు నడుస్తాయి. కాచిగూడ- కర్నూలు 07023 -07024 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈ రైళ్లు సోమవారం కాచిగూడలో 11.30 గంటలకు బయలుదేరి 4.15 గంటలకు కర్నూలు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో కర్నూలులో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి రాత్రి 9.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. కాచిగూడ నుంచి నిజామాబాద్‌కు సోమవారం ఉదయం 11 గంటలకు బయలుదేరి మధ్యాహ్నాం 3 గంటలకు నిజామాబాద్ చేరుతుంది. తిరుగుప్రయాణంలో నిజామాబాద్‌లో 3.40 గంటలకు బయలుదేరి రాత్రి 7.30 గంటలకు కాచిగూడ చేరుతుంది. సికింద్రాబాద్ - బొలారం మధ్య డెమో రైలును తిప్పుతామని రైల్వే సీపీఆర్‌వో రాకేశ్ తెలిపారు.