రాష్ట్రీయం

ఘనంగా చండీయాగ పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, అక్టోబర్ 16: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో ఆ గ్రామ వాస్తవ్యులు, మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న సహస్ర చండీయాగం పూజలు 4వ రోజు బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి మండపంలో ఉదయం పీఠాధిపతులు, పండితులు, అర్చకులు వేద మంత్రాలు ఉచ్ఛరిస్తూ పూజలు, యాగాలు నిర్వహించారు. సాయంకాల సమయాన నవాక్షరీ మూల మంత్ర అనుష్ఠానం, ప్రముఖులచే ప్రసంగాలు, అష్టావధాన సేవ, రుద్ర క్రమార్చనలు, తీర్థప్రాశనం వంటి పూజలను నిర్వహించారు. చండీయాగ కార్యక్రమానికి చినజీయర్‌స్వామితో పాటు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, శ్రీవామనాశ్రమస్వామి, మాధవానంద సరస్వతి హాజరై తమ ప్రవచనాలను అమ్మవారి మండపంలో వినిపించగా హాజరైన భక్తులు ఆసక్తితో విన్నారు. యాగ పూజలను నిర్వహిస్తూండగా మరో వైపు హాజరైన మహిళలతో పండితులు కుంకుమ పూజలు చేయించి తీర్థ ప్రసాదాలను, యాగపూజలను చూసి తరించేందుకు ఇతర రాష్ట్రాలు, జిల్లాలు, మండల కేంద్రాల నుండి భక్తులు తరలి రావటంతో ఉదయం నుండి మండప ప్రాంగణమంతా రద్దీగా మారింది. యాగ పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్‌ను పొంగులేటి దంపతులు ఆహ్వానించి అమ్మవారి ఙ్ఞపికను అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ కేశవరావు, సత్తుపల్లి, తిరువూరు, జగ్గయ్యపేట ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రక్షణనిధి, సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీ బాలస్వామి లక్ష్మీ నారాయణ, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వరరావు, మచ్ఛానాగేశ్వరరావుతో పాటు అనేక మంది ప్రముఖులు హాజరై జరగుతున్న పూజ కార్యక్రమాలను తిలకించారు.

*చిత్రం...యాగం నిర్వహిస్తున్న చినజీయర్‌స్వామి, పొంగులేటి