రాష్ట్రీయం

జనసేన విస్తరణకు వ్యూహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: జనసేన విస్తరణకు పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ తాజా వ్యూహాలను రచిస్తున్నారు. ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో పోటీకి రంగం సిద్ధం చేయడంతో, పాటు ఇరు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు, వివిధ పథకాల అమలు, ప్రజాసమస్యలను గుర్తించి వాటి కోసం వివిధ రూపాల్లో పోరాటాలను ఖరారు చేసుకోవాలని పార్టీ నేతలకు పవన్‌కళ్యాణ్ సూచించారు. మరో పక్క ఇరు రాష్ట్రాల్లోనూ ‘ఆకర్ష’ పథకం కొనసాగుతున్నందున, పార్టీ సీనియర్ నేతలను కాపాడుకునేందుకు నిరంతరం ఏదో ఒక కార్యక్రమాన్ని ఇరు రాష్ట్రాల్లో చేపట్టాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే జనసేన పార్టీ పోలిట్‌బ్యూరో సమావేశాన్ని 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ ప్రశాసన్‌నగర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. 20వ తేదీ ఉదయం 11 గంటలకు రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పాలన తీరుతెన్నులు, పార్టీ సంస్థాగత అంశాలపై కూడా ఈ సమావేశాల్లో చర్చించనున్నట్టు పార్టీ నేత ఒకరు చెప్పారు.

*చిత్రం...జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్