రాష్ట్రీయం

సమ్మె పరిష్కారం కోసం జోక్యం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: సమ్మె చేస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల జీవితాలు, జీవనోపాధిని కాపాడేందుకు, వారి సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే జోక్యం చేసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా కోరారు. ఈమేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశారు. సీపీఐ రాష్ట్ర నాయకుడు నారాయణ శుక్రవారం ఢిల్లీలో విలేఖరులకు ఈ విషయం చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం మంటగలిసిందని, మానవ హక్కులు మృగ్యమయ్యాయని నారాయణ ఆరోపించారు. కార్మిక సంఘాల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం ఆర్టీసీ కార్మికులు హక్కుల కోసం సమ్మెకు దిగితే రాష్ట్ర ప్రభుత్వం అణిచివేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు చట్టం పట్ల ఏ మాత్రం గౌరవం లేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ కోర్టులిచ్చే ఆదేశాలు, సలహాలను కూడా ఖాతరు చేయటం లేదని అన్నారు. ఆర్టీసీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా కార్మికులకు వేతనాలు చెల్లించకుండా నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. 40 వేల మంది ఉద్యోగులను తొలగించారని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకూ ఐదుగురు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరింత మంది చేసుకునే ప్రమాదం ఉందని, దీనికంతటికీ సీఎం కేసీఆరే కారణమని నారాయణ ధ్వజమెత్తారు. వామపక్ష పార్టీలు శుక్రవారం బంద్ సంధర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవనాన్ని ముట్టడిస్తారని ఆయన ప్రకటించారు.