రాష్ట్రీయం

బంద్‌కు మస్తు బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: ఆర్టీసీ కార్మికుల జేఏసీ తలపెట్టిన శనివారం నాటి రాష్ట్ర బంద్ నేపథ్యంలో సర్కారు అప్రమత్తమైంది. అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. మరోవైపు పోలీస్ శాఖ సమ్మెపై ప్రత్యేక దృష్టి సారించింది. బంద్ సందర్భంగా ప్రభుత్వ అస్తులకు నష్టం, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) ఎం. మహేందర్‌రెడ్డి రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్‌లకు చెందిన పోలీసు కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బంద్‌పై తీసుకోవాల్సిన చర్యలపై అధికారుకు సూచనలిచ్చారు. లకిడికాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో మహేందర్ రెడ్డి శాంతి భద్రతలతో పాటు వివిధ విభాగాలకు చెందిన అదనపుడీజీపీలతో అత్యవసర సమావేశం నిర్వహించిన ఆయన శాంతి భద్రతల అంశాన్ని సమీక్షించారు. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఈ బంద్‌కు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు అన్ని ప్రతిపక్ష పార్టీలతో పాటు వివిధ ఉద్యోగ, విద్య, ఉపధ్యాయ సంఘాలు అండగా నిలిచాయి. టీఎన్జీవోలు కూడా మద్దతునిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అర్టీసీ కార్మికుల సమ్మె విజవంతంగా కొనసాగుతున్నది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లా కేంద్రాల్లోనూ సమ్మె జోరుగా సాగుతోంది. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య ఇప్పటి వరకూ సయోద్య కుదరకపోవడంతో హైకోర్టు తీవ్రంగా స్పందిన విషయం కూడా విదితమే. శనివారం ఉదయం 10.30 గంటలకు ఆర్టీసీ జేఏసీ, ప్రభుత్వం చర్చలు ప్రారంభించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, చర్చలదారి చర్చలదే.. బంద్ దారి బంద్‌దే అని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఇప్పటికే తమకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి మద్దతు తెలిపాయని పేర్కొంది.
ఇలావుంటే, శనివారం నాటి బంద్‌పై రాష్ట్ర హోం శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంచానీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన ఏర్పాట్లు చేయడంలో పోలీసు అధికారులు నిమగ్నమయ్యారు. సమ్మె ప్రారంభం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్ డిపోలు, బస్టాండ్‌ల వద్ద ప్రత్యేక పోలీసు పికెట్‌లను ఏర్పాటు చేసిన అధికారులు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ఎప్పటికపుడు పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. కాగా, బంద్ సందర్భంగా ఎవరైన ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినా లేక శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలకు పోలీస్ శాఖ సిద్ధమైంది. విధ్వంసాలు సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహిరించాలని పోలీస్ అధికారులకు డీజీపీ అదేశాలు జారీ చేశారు. బంద్‌పై ముందు తీసుకుంటున్న ముందు జాగ్రత్తల్లో భాగంగా, పోలీసులు శుక్రవారం రాత్రి వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు అర్టీసీకి చెందిన కీలక నాయకులను గృహ నిర్బంధం చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని బస్ భవన్, జూబ్లీ బస్టాండ్, మహాత్మా గాంధీ బస్టాండ్‌లో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. బస్సుల్లో ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
క్యాబ్ డ్రైవర్ల సమ్మె
ఒకవైపు రాష్ట్ర బంద్‌కు ఆర్టీసీ జేఏసీ, వివిధ రాజకీయ పార్టీలు పిలుపునిస్తే, మరోవైపు క్యాబ్ డ్రైవర్లు సమ్మె బాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ శనివారం నుంచి వారు నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. ఆర్టీసీ సమ్మెతో ప్రజలు ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో క్యాబ్ డ్రైవర్లు కూడా అదే దారి పట్టడంతో ప్రజలకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.