రాష్ట్రీయం

అసెంబ్లీ సీట్ల పెంపు ఆగినట్టేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ సీట్లను పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ముందుగా ప్రకటించినట్టుగా ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపాదించే అవకాశం కనిపించడం లేదు. శాసన సభ సీట్ల పెరుగుదలను ఆశగా చూపించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ ఫిర్యాదు చేసినందుకే పునరాలోచనలో పడినట్టు తెలిసింది. తెలంగాణలో బిజెపిని పటిష్ఠం చేయటంతోపాటు 2019 ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మే మూడో వారంలో రాష్ట్రానికి రానున్నారు. ఢిల్లీ వచ్చిన లక్ష్మణ్ బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లతో రాష్ట్ర పరిస్థితిపై చర్చించారు. సోమవారం విలేఖరుల సమావేశం లో ఆ సమావేశాల విషయాలను వెల్లడించారు. రాజకీయ స్థిరత్వం కల్పించేందుకే రెండు రాష్ట్రాల శాసనసభల సీట్లు పెంచాలని ఏపీ విభజన చట్టంలో ప్రతిపాదించారు. అయితే రెండు రాష్ట్రా ల ముఖ్యమంత్రులు మాత్రం దీనిని తమ రాజకీయ ప్రయోజనాలకోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో టిఆర్‌ఎస్ తమ శాసనసభ్యులను కొనుగోలు చేస్తోందని ఆరోపించే తెలుగుదేశం, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సిపి శాసన సభ్యులను తమ పార్టీలో చేర్చుకోవటం ఏ విధంగా సమర్థనీయమని ఆయన ప్రశ్నించారు. శాసనసభల సీట్ల సంఖ్య పెరగాలని బిజెపి కూడా కోరుకుంటోందని, అయితే ఈ ప్రక్రియను ఆచితూచి చేయాలని అధినాయకత్వానికి, ఎన్‌డిఏ ప్రభుత్వానికి సూచించినట్లు లక్ష్మణ్ వివరించారు. తెలంగాణలో బిజెపిని పటిష్టం చేయటంతోపాటు 2019 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నాటికి రాజకీయ శక్తిగా రూపొందిస్తామని ఆయన అన్నారు. ఏ మిత్రపక్షంతో సంబంధం లేకుండా ఒంటరిగా పార్టీని ప్రజల్లోకి తీసుకుపోతామని ఆయన ప్రకటించారు. తెలుగుదేశంతో ఉన్న పొత్తుల గురించి అడగగా, పొత్తులు ఎన్నికల సమయంలోనే ఉంటాయి, ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి తెలుగుదేశంతో పొత్తు లేనట్లేనని లక్ష్మణ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కనీసం రెండు లోక్‌సభ సీట్లతోపాటు శాసనసభ్యుల సంఖ్యను కూడా బాగా పెంచుకుంటామని లక్ష్మణ్ తెలిపారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్ఠానం త్వరలోనే దృష్టి సారిస్తుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌పట్ల ప్రజల విశ్వాసం సన్నగిల్లింది, అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ హామీలు అమలు చేయటంలో విఫలమై ప్రజలకు దూరమైపోతోందని, ఇదే సమయంలో తమ పార్టీని మరింత బలోపేతం చేస్తామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా బిజెపి ఎదుగుతోందని, ప్రజల విశ్వాసాన్ని సంపాదించేందుకు ఈ నెల 23 నుండి జిల్లాల యాత్ర ప్రారంభిస్తానని లక్ష్మణ్ ప్రకటించారు.