రాష్ట్రీయం

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల తొలగింపు అప్రజాస్వామికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో 48 వేల మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం తొలగించడం అప్రజాస్వామికమని, చర్చలు జరిపి సమ్మెను విరమింపజేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు జనసేన మద్దతిస్తున్నట్లు పవన్ ఇప్పటికే ప్రకిటించిన విషయం విదితమే. కార్మిక సంఘాల న్యాయపరమైన డిమాండ్లను తీర్చాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, పోరాడి డిమాండ్లను సాధించుకోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గత 16 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం గమనార్హం. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇసుక లభ్యత లేకపోవడం వల్ల పనులు లేక రోడ్డున పడిన నిర్మాణ కార్మికుల పక్షాన నవంబర్ 3 లేదా 4న విశాఖపట్నం వేదికగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన, లాంగ్ మార్చ్ చేపట్టనున్నట్లు పవన్ తెలిపారు. ఆదివారం ఇక్కడి ప్రశాసన్‌నగర్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక, లిక్కర్ పాలసీ, వైసీపీ ప్రభుత్వ విధానాలపై సదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వాల వైఫల్యాలు, ప్రజల సమస్యలతో పాటు వివిధ కీలక అంశాలపై చర్చలో ప్రస్తావనకు వచ్చాయి. మరీ ముఖ్యంగా జనసేన పార్టీ బలోపేతంపై అఫైర్స్ కమిటీకి పవన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. 48 వేల మంది ఆర్టీసీ కార్మికులను తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అప్రజాస్వామిక నిర్ణయాన్ని తలదనే్నలా ఏపీ వ్యవహరిస్తోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. 2.5 లక్షల ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలిగించేలా ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపుపై చర్చించారు. రెగ్యులరైజ్ చేయమని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు కోరుతున్న తరుణంలో ఈ విధమైన నిర్ణయం సరికాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆంధ్ర రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందని భావిస్తున్న పవన్ వారికి మద్దతుగా నిలవాలని నిర్ణయించారు. ఉపాది లభించక తీవ్ర ఇక్కట్లపాలవుతున్న భవన నిర్మాణ రంగ కార్మికుల పట్ల సంఘీభావంతో విశాఖపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంది.