రాష్ట్రీయం

సైక్లింగ్‌తో ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాధర నెల్లూరు, అక్టోబర్ 20: చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా సుమారు 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కారు. ఆదివారం ఉదయం కలెక్టర్ తన స్నేహితులతో కలిసి చిత్తూరు నుంచి పల్లిపట్టు, బలిజకండ్రిగ, పాలసముద్రం, గంగాధరనెల్లూరు మీదుగా వంద కిలోమీటర్లు సైకిల్ సవారీ చేసి చిత్తూరు నగరానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం 5 గంటలకు తన స్నేహితులతో కలిసి చిత్తూరులో ప్రారంభమైన సైకిల్ సవారి 9 గంటల వరకు కొనసాగింది. పాలసముద్రంలో అల్పాహారం కోసం పది నిమిషాలు ఆగి తిరిగి సైకిల్‌పైనే చిత్తూరుకు వెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేఖరులతో మాట్లాడుతూ దేహదారుఢ్యం, ఆరోగ్యం మెరుగుకోసం సైక్లింగ్ ఒక వరంలాంటిదన్నారు. అందుకే ప్రతి ఆదివారం కొంత దూరం సైకిల్‌పై సవారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఆధునిక సమాజంలో మెరుగైన ఆర్యోగం కోసం సైకిల్ తొక్కడం ఎంతో మంచిదని ఆయన పేర్కొన్నారు.