రాష్ట్రీయం

హిందూ ధర్మంపై దాడి చేయడం ఎవరితరమూ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆక్టోబర్ 20: సమాజంలో దాడులను తట్టుకొని హిందుత్వం నిలబడిందని, అయితే హిందూ ధర్మాన్ని అంతం చేయడం ఎవరితరం కాదని వీహెచ్‌పీ అఖిల భారత మఠ మందిర్ ప్రముఖ్ అరవింద్ బ్రహ్మభట్ అన్నారు. కాచిగూడలోని శ్యాంమందిర్ సమావేశ గదిలో తెలంగాణ ప్రాంత మఠ మందిర్ ప్రముఖ్‌ల సమావేశం నిర్వహించారు. వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి నగరంలోని వివిధ దేవాలయ చైర్మన్లు, పలువురు స్వామీజీలు, ఆథ్యాత్మికవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అరవింద్ బ్రహ్మభట్ మాట్లాడుతూ హిందూ ధర్మానికి దేవాలయాలు వెనె్నముక లాంటిందన్నారు. మనిషి మానసిక ప్రశాంతతోపాటు శక్తిని పెంచుకోవడం, ముక్తి మార్గం ఎంచుకోవడం, నిజాయితీగా మసులు కోవడం, సంస్కారాన్ని ఏర్పరుచుకోవడం అనేది దేవాలయాల నుంచే లభిస్తుందన్నారు. ముఖ్యంగా హిందువుల్లో చైతన్యం, ఐక్యమత్యం నెలకొనేందుకు ఆలయాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్నారు. హిందూ సంఘటన శక్తిని పెంచే ఆలయాలని భగవంతుడిని ప్రశాంతంగా పూజించి మానసిక శక్తిని పెంచుకోవాలని సూచించారు.
*చిత్రం...తెలంగాణ ప్రాంత మఠ మందిర్ ప్రముఖుల సమావేశంలో మాట్లాడుతున్న వీహెచ్‌పీ అఖిల భారత మఠ మందిర్ ప్రముఖ్ అరవింద్ బ్రహ్మ భట్