రాష్ట్రీయం

తిరుపతిలో ఆర్‌బీఐ చెస్ట్ ఏర్పాటుకు టీటీడీ కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 22: చిత్తూరులో ఉన్న ఆర్‌బీఐ చెస్ట్‌ను తిరుపతికి తరలించాలని టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి ఆర్‌బీఐ అధికారులను కోరినట్లు సమాచారం. తిరుపతిలో చెస్ట్ ఏర్పాటుచేస్తే భక్తులు హుండీలో సమర్పించే చిల్లర నాణేలను బ్యాంకులకు అందించడం సులభతరమవుతుందని టీటీడీ భావిస్తోంది. ఇదిలావుండగా గత ఎంతోకాలంగా భక్తులు సమర్పించిన చిల్లర నాణేలు టీటీడీలో భారీగా పేరుకుపోయిన విషయం విధితమే. వీటిని కరెన్సీ రూపంలో మార్చడానికి టీటీడీకి సాధ్యంకాని పనిగా తయారైంది. ఈనేపథ్యంలో టీడీపీ అదనపు ఈఓగా బాధ్యతలు స్వీకరించిన ఏవీ ధర్మారెడ్డి కేవలం రెండు నెలల వ్యవధిలోనే రూ.26 కోట్ల చిల్లర నాణేలను మార్పిడి చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మరో రూ.5 కోట్ల మేర చిల్లర నాణేలు ప్రస్తుతం నిల్వ ఉన్నట్లు సమాచారం. నెలాఖరులోపు వీటిని కూడా మార్పిడి చేసేందుకు ధర్మారెడ్డి దృష్టి సారిస్తున్నారు.