రాష్ట్రీయం

అఖిల ప్రియ ఇంటి వద్ద ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్‌ను అరెస్టు చేసేందుకు హైదరాబాద్‌లోని ఆమె ఇంటికి, ఏపీ పోలీసులు వచ్చిన సమయంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆళ్లగడ్డకు చెందిన పోలీసులు హైదరాబాద్‌కు చేరుకుని అఖిల ప్రియ ఇంటి వద్దకు వెళ్లారు. ఏదైనా సెర్చ్ వారెంట్ ఉందా? అని అడిగిన ఆమె, వారెంట్ లేకుండా ఎలా వస్తారని వారిని ప్రశ్నించారు. పోలీసుల వైఖరిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అఖిల ప్రియ, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు తమ పక్కింట్లోకి వెళ్లి, అక్కడి నుంచి గోడ దూకి తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని ఆరోపించారు. ఇంట్లోని సామాన్లను కూడా వారు ధ్వంసం చేశారని, నానా హంగామా సృష్టించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఎస్పీ చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తూ, తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, ఈ విషయంపై తాము కూడా పోలీసు కేసు పెడతామని ఆమె పేర్కొన్నారు.