రాష్ట్రీయం

రాష్ట్రానికి వడదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఎండలు ప్రాణాంతకంగా మారాయి. 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దాటితే దాన్ని వడగాడ్పు (హీట్‌వేవ్)గా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది ఇప్పుడు పలు ప్రాంతా ల్లో 45 డిగ్రీల సెల్సియస్ ఊష్ణోగ్రత దాటింది. దీనిని తీవ్ర వడగాడ్పుగా పరిగణిస్తారు. రాష్టవ్య్రాప్తంగా 885 కేంద్రాల ద్వారా డేటాను సేకరిస్తున్నారు. ఎండలకు సంబంధించి ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం హీట్‌వేవ్ వెబ్ పోర్టల్‌ను రూపొందించింది. 885 కేంద్రాల నుంచి డేటాను సేకరించి పోర్టల్‌లో నమోదు చేస్తారు. వడగాడ్పులకు సంబంధించి ఈ సమాచారాన్ని టెలికాం కంపెనీల ద్వారా ప్రజలకు ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తారు. వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ఎస్‌ఎంఎస్ సందేశం ద్వారా అప్రమత్తం చేస్తారు. ఎండల తీవ్రత నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హీట్‌వేవ్ పోర్టల్‌లోని సమాచారాన్ని అనుసరించాలని ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ కోరారు. ఐటి శాఖ రూపొందించిన హీట్‌వేవ్ పోర్టల్‌ను సోమవారం ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సచివాలయంలో ఆవిష్కరించారు. వడదెబ్బకు గురైన వారికి తక్షణ సహాయం అందించేందుకు 104, 108 వాహనాలను సిద్ధంగా ఉంచినట్టు చెప్పారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొనే పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించినట్టు తెలిపారు.
మజ్జిగ పంపిణీ
చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఎన్‌జివోలు, స్వయం సహాయక బృందాలు, వ్యక్తులు, సంఘాలు చలివేంద్రాలు ప్రారంభించేట్టుగా ప్రోత్సహించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఎండలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఎక్కువగా ఉండడం వల్ల ఆ సమయంలో ప్రధానమైన ఆర్టీసి డిపోలు, బస్ స్టాండ్స్, టెర్మినల్స్, ఇతర ప్రాంతాల్లో రవాణాశాఖ, ఆర్టీసి హెల్త్ టీంలను ఏర్పాటు చేస్తోంది.