ఆంధ్రప్రదేశ్‌

సింహాచలం ఆనువంశిక ధర్మకర్తగా అశోక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, ఏప్రిల్ 18: శతాబ్ధాల చరిత్ర గల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఆనువంశిక ధర్మకర్తగా కేంద్రమంత్రి అశోక గజపతిరాజు సోమవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. ఆలయ ఆస్థాన మండపంలో దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ అశోక గజపతిరాజుతో ప్రమాణ స్వీకారం చేయించారు. దేవాలయ వైదిక పెద్దలు పలువురు అధికారులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అశోక గజపతిరాజు ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేసి అధికారిక పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ తన సోదరుడు ఆనంద గజపతిరాజును తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కొద్దిసేపు ఉద్వేగానికి గురయ్యారు. జీవితంలో దేవాలయ ధర్మకర్త బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుందని తానెప్పుడూ అనుకోలేదని, వరాహ లక్ష్మీనృహింహస్వామి ఎందుకు ఆ విధంగా సంకల్పించారో తెలియదన్నారు. అయితే భగవంతుడు తనపై ఉంచిన బాధ్యతను భుజస్కంధాలపై వేసుకుంటానని అన్నారు. సింహాద్రినాథునికి సేవ చేసే భాగ్యం తమ వంశీయులకు కలగడం అదృష్టమన్నారు. సోదరుడి మరణం బాధిస్తున్న బాధ్యతలను నిర్వర్తించడంలో సంతృప్తిగా సాగుతానని అశోక గజపతిరాజు అన్నారు. అంతకు ముందు ఆయన సింహాచలేశుని దర్శించుకున్నారు. ఈవో రామచంద్రమోహన్ కేంద్రమంత్రి పరివారానికి స్వాగతం పలికారు. అంతరాలయంలో అశోక గజపతిరాజు పేరున అర్చకులు సంప్రదాయ పూజలు నిర్వహించారు. ఆస్థాన మండపంలో నాలుగు వేదాలు, నాదస్వర వాయిద్యాలతో అర్చకులు అశోక గజపరాజు కుటుంబాన్ని ఆశీర్వదించారు.
వైభవంగా రథోత్సవం
సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి తిరుకల్యాణోత్సవం సింహగిరిపై సోమవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. నాదస్వర వాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తకోటి గోవింద నామస్మరణల నడుమ సింహాచలేశుడు శ్రీదేవి, భూదేవిలను పరిణయమాడారు. రాష్ట్ర ఆగమ సలహామండలి సభ్యుడు మోర్తి సీతారామాచార్యులు, ఆలయ ఆస్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యుల పర్యవేక్షణలో అర్చక పరివారం పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారం కల్యాణ వేడుకను నిర్వహించింది. దేవాలయంలో సనాతనంగా వస్తున్న సంప్రదాయం ప్రకారం పూసపాటి వంశీయులు అశోక గజపతిరాజు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

చిత్రం ధర్మకర్తగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కేంద్రమంత్రి అశోక గజపతిరాజు