రాష్ట్రీయం

అధ్దె గదుల ధరలు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 7 : శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే సామాన్య, మధ్యతరగతి భక్తులకు అందుబాటులో ఉండే నందకం, కౌస్త్భుం, పాంచజన్య అతిథి భవనాల్లో గదుల అద్దెను పెంచుతూ టీటీడీ యాజమాన్యం గురువారం నుంచి తీసుకుని అమలు చేస్తోంది. నందకం అతిథి భవనంలో ఒక గది రూ.600లకు కేటాయిస్తూ వచ్చారు. అయితే రూ.400 పెంచి రూ.వెయ్యిగా టీటీడీ ధర నిర్ణయించింది. అలాగే కౌస్త్భుం, పాంచజన్యంలో రూ.500 నుంచి రూ.వెయ్యికి ధర పెంచారు. తిరుమలకు వచ్చే భక్తులకు బస చేయడానికి రూ.50 నుంచి రూ.5 వేల వరకు అద్దె ఉండే గదులు అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్, ఈ-దర్శన్ ద్వారా రూ.100, రూ.500, రూ.600, రూ.999, రూ.1500 గదులను మాత్రమే కేటాయించేవారు. వీటిలో సామాన్య, మధ్యతరగతి భక్తులు రూ.100, రూ.500, రూ.600 అద్దె కలిగి సాధారణ వసతి కలిగిన గదుల వైపు మొగ్గు చూపుతారు. అత్యధిక శాతం మంది భక్తులు రూ.100 గదుల్ని తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అయితే రూ.100 అద్దె కలిగిన గదులు తక్కువ సంఖ్యలో ఉండటంతో రూ.500, రూ.600 అద్దె ఉన్న గదుల వైపు దృష్టి సారిస్తారు. అయితే ఆ గదుల అద్దెను పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది సబబేనని కొంతమంది అంటున్నా, మరి కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉండగా తిరుపతిలో ఉన్న శ్రీనివాసం, మాధవం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం అతిథి భవనాల అద్దెలు యధాతధంగా తక్కువ ధరకే టీటీడీ కేటాయిస్తోంది.