రాష్ట్రీయం

ఉగ్రవాదుల అడ్డా డార్క్ వెబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు డార్క్ వెబ్ అడ్డాగా మారిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి శుక్రవారం నాడు పేర్కొన్నారు. డార్క్‌వెబ్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు భారత్ సైబర్ జాగ్రత్తలు తీసుకుంటోందని, క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చెయిన్ వినియోగించి కుట్రలను భగ్నం చేస్తోందని ఆయన చెప్పారు. పెనుముప్పుగా తయారైన ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలు అన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ భద్రత - ఉగ్రవాద నిర్మూలన అంశంపై ఆస్ట్రేలియా అధికారులతో చర్చలు జరిపారు.
ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే నిధులను ప్రవాహాన్ని అరికట్టాలని అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న 65 దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి మార్గదర్శకంలో ఉగ్రవాదం నిర్మూలనకు సమగ్ర ఒడంబడికను రూపొందించాలని సూచించారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ మార్గదర్శకాలని అన్ని దేశాలూ పాటించి, అక్రమ మార్గాల ద్వారా కరెన్సీ చలామణిని నిరోధించాలని, ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని అన్నారు. ఉగ్రవాద సంస్థలకు నిధులను సమకూర్చే సంస్థలు, వ్యవస్థలపై నిఘాపెట్టి, వాటిని అదుపు చేయాలని ఆయన పేర్కొన్నారు. భారత్ అనుభవంలో బ్లాక్ చెయిన్ ఆధారిత క్రిప్టో కరెన్సీల వాడకాన్ని నొక్కి చెప్పిన ఆయన వర్చువల్ ఆస్తులు, ముఖ్యంగా క్రిప్టో కరెన్సీలు నేరస్థులకు వారి మారుపేరు స్వభావం, గుప్తీకరణ, గ్లోబల్‌రీచ్ , తక్కువ ఖర్చులతో కొత్త ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తాయని అన్నారు. ఉగ్రవాదులను సైబర్ టెక్నాలజీ ఆధారితంగా ఎదుర్కొన్న భారత్ అనుభవాలను ఆయన వివరించారు.