రాష్ట్రీయం

‘గ్రీన్ చాలెంజ్’ను స్వీకరించిన జయసుధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’లో భాగంగా రాజ్యసభ సభ్యుడు జే.సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించిన వారి సంఖ్య దాదాపు మూడు కోట్లకు చేరుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఇచ్చిన ‘గ్రీన్ చాలెంజ్’ను సినీనటి జయసుధ స్వీకరించారు. శుక్రవారం కోలేటి దామోదర్ సమక్షంలో నార్సింగిలోని ఆయన నివాసంలో మూడు మొక్కలను నాటి గ్రీన్ చాలెంజ్‌ను నెరవేర్చి, తిరిగి ప్రసిద్ధ సినీ నటులు మోహన్ బాబు, మురళీమోహన్, ప్రఖ్యాత టీవీ యాంకర్ సుమకు సవాల్ విసిరారు. ఈ పథకంలో భాగంగా వారు ముగ్గురు కూడా తలా మూడు మొక్కలు నాటి ఒక్కొక్కరు మరో ముగ్గురికి ఈ చాలెంజ్‌ను చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా దామోదర్ మాట్లాడుతూ ఖనిజ సంపద, జల సంపద దేశాభ్యుదయానికి అవసరమో, వన్య సంపద కూడా అవసరమని, సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చడానికి హరితహారాన్ని ప్రవేశపెట్టారని, ఇది మంచి ప్రజాదరణ పొందుతోందని అన్నారు.
ఆస్ట్రేలియా సిడ్నీలో..
గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం రాష్ట్రం, దేశం దాటి ఆస్ట్రేలియాతో సిడ్నీ నగరంలో టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో తెలంగాణలోని ప్రజలకు దీని ఆవశ్యకతను తెలపడానికి మొక్కలు నాటారని ఆ రాష్ట్ర అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి తెలిపారు.