రాష్ట్రీయం

బస్సు రూట్ల ప్రైవేటీకరణపై చర్యలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: తెలంగాణ ఆర్టీసీ బస్సు రూట్ల ప్రైవేటీకరణపై ఎలాంటి చర్యలుగానీ, నిర్ణయాలుగానీ తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు శుక్రవారం నాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమ్మె కారణంగా ఆర్టీసీ మునుపటి రీతిన ఉండబోదని, అసలు ఆ సంస్థే ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక, 5,100 రూట్లను ప్రైవేటీకరిస్తున్నట్టు ఆయన చేసిన ప్రకటనపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ పీఎల్ విశే్వశ్వరరావు అత్యవసరంగా దాఖలు చేసిన ప్రజావాజ్య పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరిస్తే, దానిపై కార్పొరేషన్ బోర్డు నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందని పిటిషినర్ స్పష్టం చేశారు. కార్పొరేషన్‌కు ప్రత్యేక ఉనికి ఉంటుందని, కాబట్టి నిర్ణయాన్ని బోర్డు కాకుండా మంత్రిమండలి ఎలా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించా రు. కేంద్ర ప్రభుత్వం ఏపీఎస్‌ఆర్టీసీ విభజన చేయమని ఇరు రాష్ట్రాలూ కోరలేదని చెబుతోందని, ఇంకో పక్క టీఎస్‌ఆర్టీసీ కొత్త సంస్థగా ఏర్పడిందో, విభజనలో భాగంగా ఏర్పడిందో ప్రభుత్వం స్పష్టం చేయలేకపోతోందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఆర్టీసీకి సంబంధించి బస్సు రూట్లను ఎలా ప్రైవేటీకరిస్తారని పిటిషనర్ తన వాదన వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రప్రభుత్వం తాజాగా రూపొందించిన మోటారు వాహనాల చట్టం గురించి మాట్లాడుతోందని, ఆ చట్టంలో ఎక్కడా రోడ్డు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్లను ప్రైవేటీకరించాలని లేదని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభు త్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ, ఇందుకు సంబంధించి మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ సమయంలో కోర్టు స్పందిస్తూ, మంత్రి మండలి నిర్ణయాల పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మంత్రి మండలి నిర్ణయాల పత్రాలను బహిరంగపర్చడం ఇష్టం
లేకుంటే వాటిని సీల్డు కవరులో అందజేయాలని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో, తదుపరి విచారణ వరకూ ప్రైవేటీకరణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురువారం నాడు ఆర్టీసీ సమ్మె, కార్మికుల జీతాల చెల్లింపు, ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితి తదితర అంశాలపై విచారణ జరిపిన న్యాయస్థానం 11వ తేదీలోగా కార్మికులతో చర్చలు జరపాలని సూచించించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇచ్చిన నివేదికలు గజిబిజిగా ఉన్నాయని, తెలంగాణ సమాజం ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొంది. ఇంకో పక్క కేంద్రప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ నామవరపు రాజేశ్వరరావు వాదనలు వినిపిస్తూ ఆర్టీసీ విభజనకు ఇరు రాష్ట్రాలూ కేంద్రాన్ని కోరలేదని పేర్కొన్నారు.
జగన్‌కు మినహాయింపు
సీబీఐ కోర్టులో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వ్యక్తిగత హాజరును శుక్రవారం నాడు ఒక్కరోజుకు మినహాయించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ కారణంగా తాను సీబీఐ కోర్టుకు హాజరుకాలేనని జగన్ చేసిన విజ్ఞప్తిని సీబీఐ కోర్టు మన్నించింది. కాగా ఇదే కేసులో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి కోర్టు ముందు హాజరయ్యారు.