రాష్ట్రీయం

ఐదెకరాలు తిరస్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అయోధ్య రామజన్మభూమి వివాదం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై తనకు సంతృప్తిగాలేదని, కాని రాజ్యాంగం పట్ల తనకు నమ్మకం ఉందని ఎంఐఎం ఎంపీ, ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ అంశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని కోర్టు చేసిన ప్రతిపాదనను తిరస్కరించాలన్నారు. తాము ఎవరి వద్ద భిక్ష కోసం పోరాటం చేయలేదన్నారు. హైదరాబాద్ రోడ్లపై భిక్షాటన చేస్తే, యూపీలో మసీదును కట్టేందుకు సొమ్ము వస్తుందన్నారు. సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని అధికరణ 142ను ఉపయోగించడంపై తనకు అసంతృప్తి ఉందన్నారు. న్యాయమైన హక్కు కోసం పోరాటం చేస్తున్నామన్నారు. బాబ్రీ మసీదుకు ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. ఎంఐఎం త్వరలో ఈ అంశంపై సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటిస్తుందన్నారు. అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా సమావేశం ఏర్పాటు చేసి తీర్పుపై లోతుగా సమీక్షిస్తుందన్నారు. ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను వేయాలా వద్దా అనే విషయమై త్వరలో నిర్ణయిస్తామన్నారు. శాంతి భధ్రతలను రెచ్చగొట్టేందుకు తాను మాట్లాడడం లేదన్నారు. కోర్టుపై తమకు అపారమైన గౌరవం ఇప్పుడు, భవిష్యత్తులో ఉంటుందన్నారు. భారత్‌ను హిందుత్వ మతతత్వశక్తుల నుంచి కాపాడాలన్నారు. తాము ఏ విషయమై కూడా కాంగ్రెస్‌తో కలిసే ప్రసక్తి లేదన్నారు. కాంగ్రెస్ బీజేపీలో కలిసిపోయిందన్నారు. భారత్‌ను రక్షించేందుకు ధర్మం, న్యాయం ఉందన్నారు. సంఘ్‌పరివార్ రాబోయే రోజుల్లో మసీదులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందన్నారు. ముస్లింలు ఎవరికీ భయపడరాదన్నారు. భయపడి బతకాల్సిన అవసరం లేదన్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తామని, దేవునిపై నమ్మకంతో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. 1991 డిసెంబర్ 6వ తేదీన జరిగిన ఘటన దేశ లౌకిక వ్యవస్థను దెబ్బతీసిందన్నారు. ఇకపై దేశంలో అనేక మసీదులు తమవేనని, వీటి కింద మందిరాలు ఉన్నాయని సంఘ్ పరివార్ చెబుతుందన్నారు.

*చిత్రం...ఎంఐఎం ఎంపీ, ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ