రాష్ట్రీయం

తెలంగాణలో త్వరలో అమెరికా వర్సిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: తెలంగాణలో త్వరలో అమెరికా యూనివర్శిటీలు ఏర్పాటు చేయాలని అమెరికాలోభారత రాయబారిని కోరినట్లు, ఈ విషయమై సానుకూలంగా స్పందించినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ చెప్పారు. ఆయన అమెరికాలో వాషింగ్టన్ డీసీలో అమెరికాలో భారత రాయబారి డిప్యూటీ చీఫ్ అమిత్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తెలంగాణలో విదేశీ విశ్వద్యాలయాలు ఏర్పాటు చేస్తే మంచి స్పందన వస్తుందన్నారు. ఫార్మా, ఐటీ పరిశ్రమలకు హైదరాబాద్ హబ్‌గా మారినట్లు ఆయన చెప్పారు.
త్వరలో మన పార్లమెంటు నూతన విద్యా చట్టాన్ని తీసుకువస్తుందని, రీసెర్చి వర్శిటీ నెలకొల్పేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఆయన రాయబారికి తెలిపారు. అమెరికాలో అత్యున్నత విశ్వవిద్యాలయాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను ఎన్నారైలకు వివరింనట్లు చెప్పారు. అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్ అధ్యక్షురాలు నిషా బిస్వాల్‌ను ఆయన కలిశారు.