రాష్ట్రీయం

మాతృభాషలోనే ప్రాథమిక విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 10: ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలన్నది తన ఉద్దేశ్యమని, ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. విశాఖ లోక్‌నాయక్ ఫౌండేషన్ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో యార్లగడ్డ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధనకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయాన్ని తాను ఏకీభవిస్తున్నానని, అయితే పూర్తిగా ఆంగ్ల మాధ్యమానే్న అమలు చేస్తామంటే సరికాదన్నారు. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా అమలు చేయాలని సీఎంను కోరతానన్నారు. ప్రస్తుత కాలంలో ఆంగ్ల మాధ్యమానికి జనాదరణ ఉంటోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు జీవో విడుదల చేశారన్నారు. అయితే కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం 1 నుంచి 6వ తరగతి వరకూ మాత్రమే పరిమితం చేశారన్నారు. కొత్త జీవో ప్రకారం సీబీఎస్సీ, ఐసీఎస్సీ సిలబస్‌లో కూడా తప్పనిసరిగా తెలుగు ఒక పాఠ్యాంశంగా కొనసాగుతుందన్నారు. తెలుగుకు ప్రాధాన్యత విషయంలో తన తీరులో ఎటువంటి మార్పు లేదన్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షునిగా తెలుగులోనే అన్ని ఉత్తర ప్రత్యుత్తురాలు, ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. తెలుగు ప్రాచీన అధ్యయన వేదికను నెల్లూరుకు తీసుకువచ్చామని, రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి జరుగుతోందని పేర్కొన్నారు.
*చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్