రాష్ట్రీయం

హంద్రీ ఎక్స్‌ప్రెస్- ఎంఎంటీఎస్ ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ (హైదరాబాద్), నవంబర్ 11: ఆగివున్న రైలును మరో రైలు ఢీకొట్టిన సంఘటన సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ రెండవ ప్లాట్‌ఫామ్‌పై జరిగింది. ఈ సంఘటన వివరాలను రైల్వే పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడ స్టేషన్‌లో ఆగివున్న కర్నూలు నుంచి వచ్చిన హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కర్నూలు సిటీ నుంచి సికిందరాబాద్‌కు వస్తున్న హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైలు కాచిగూడ స్టేషన్ వద్ద ఆగింది. ఆ సమయంలో లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. కాగా, సాంకేతిక లోపం వల్లే ఎంఎంటీఎస్ రైలు ఒకే ట్రాక్‌పైకొచ్చిందని రైల్వే పోలీసులు తెలిపారు. స్టేషన్ కావడంతో రైలు వేగం తక్కువగా ఉందని, లేదంటే పెను ప్రమాదం సంభవించేదని
అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో ఎంఎంటీఎస్ రైలు మూడు కోచ్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో ఆరు కోచ్‌లు పట్టాలపై పడిపోయాయి. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని వారు తెలిపారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు. ప్రమాదంలో గాయపడిన బాధితులు రాజ్‌కుమార్, వౌనిక, అనురాధమ్మ, మిరాజ్ బేగం, బలరాం, మల్లమ్మ, ఖాదీర్, భళేశ్వరమ్మ, సులోచన, మహ్మద్ అలీ, ఆంజనేయులు, రహీముద్దీన్, ప్రభాకర్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలావుండగా, సంఘటన స్థలానికి రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ శేఖర్ ఇంజన్‌లో ఇరుక్కుపోవడంతో అతనిని బయటికి తీసేందుకు రెస్క్యూ టీం కొన్ని గంటల పాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీశాయి. అతనిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో రెండు రైళ్లు ఢీకొన్న సంఘటన నేపథ్యంలో పలు సర్వీసులు రద్దయ్యాయి. పలు రైలు సర్వీసులను ఇతర మార్గాల్లో మళ్లించి, మరికొన్ని సర్వీసులు పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వివరించారు. ‘మల్కాజ్‌గిరి - మహబూబ్‌నగర్, వికారాబాద్ - కాచిగూడ, సికింద్రాబాద్ - కాచిగూడ, మేడ్చల్ - కాచిగూడ, బొల్లారం - కాచిగూడ’ మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు.

*చిత్రం...కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఆగివున్న కర్నూలు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న ఎంఎంటీఎస్ రైలు బోగీలు పక్కకు ఒరిగిన దృశ్యం